📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Israel Iran War: ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Israel Iran War: పశ్చిమాసియాలో యుద్ధం మరో ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) టెహ్రాన్ లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది.టెహ్రాన్‌ సరిహద్దుల్లోని మింజాదెహైలో ఇరాన్ రహస్యంగా నిర్మించిన అణు స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ వెల్లడించారు. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నారని, 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడికి మళ్లించిందని తెలిపారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన 300 క్షిపణి లాంచర్‌లను తాకినట్లు ఐడీఎఫ్ తెలిపింది.

Read Also: Iran: ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు

భారీగా మిస్సైళ్లు జారవిడిచింది

జూన్ లో, జరిగిన ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ కంటే.. నాలుగు రోజులుగా జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ పై, భారీగా మిస్సైళ్లు జారవిడిచిందని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న దాడులు చేస్తున్నా ఇరాన్ తన అణు కార్యకలాపాలను ఆపలేదన్నారు.అణ్వాయుధాలకు అవసరమైన వాటిని అభివృద్ధి చేస్తూనే ఉందన్నారు.

Israel attacks Iran’s secret nuclear site

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా తమ వైమానిక దాడులు కొనసాగుతున్నట్టు తెలిపారు. ఐడీఎఫ్ తాజా దాడులకు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది.కాగా, టెహ్రాన్‌కు దక్షిణాన ఉన్న నంతాజ్ అణు స్థావరంపై కూడా ఇజ్రాయెల్ దాడిచేసినట్టు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ధ్రువీకరించింది. అయితే, అక్కడ ఎటువంటి రేడియో ధార్మికత విడుదలైన సంకేతాలు లేవని, ప్రస్తుతం ముప్పు లేదని నిర్దారించింది. గత శనివారం నుంచి ఇప్పటి వరకూ ఇరాన్‌పై 4000 బాంబులు, 1,600 యుద్ధ విమానాలతో దాడులు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

IDF Attacks Tehran Iran Secret Nuclear Base Destroyed Israel vs Iran War Minjadehai Nuclear Site

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.