గాజా(Gaza)లో ఇజ్రాయెల్ సైన్యం(Isreal Army) ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఆ నగరానికి విముక్తి కల్పిస్తామని నెతన్యాహు(Netanyahu) చెబుతున్నారు. అక్కడ హమాస్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. దానికి తగ్గట్టే ఐడీఎఫ్ గాజాలో దాడులు నిర్వహిస్తోంది. తాజాగా జరిగిన దాడుల్లో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులను చంపేశారు. అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మొహమ్మద్ క్రీఖే, అలాగే కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ లు ఉన్నారు. అల్ షిఫా హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర ప్రెస్ కోసం వేసిన టెంట్ మీద ఇజ్రాయెల్ సైన్యం అటాక్ చేసింది. ఇందులో మొత్తం ఏడుగురు మరణించగా..అందులో ఐదుగురు జర్నలిస్టులు. ఈ దాడిని తామే చేశామని ఐడీఎఫ్ ప్రకటించింది. అయితే జర్నలిస్టులలో ఒకరు హమాస్ ఉగ్రవాదని సైన్యం తెలిపింది. హమాస్ ఉగ్రవాది ఒకరు జర్నలిస్ట్ గా వ్యవహరిస్తూ తప్పించేుకుని తిరుగుతున్నాడని అందుకే చంపామని తన దాడిని సమర్ధించుకుంది.
జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరిగిన తాజా దాడి ఇదే
దాడిలో చనిపోయిన అనాస్ అల్ షరీఫ్ అనే వ్యక్తి హమాస్ ఉగ్రవాదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. హమాస్‌లోని ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడని అంటోంది. ఇతని వయసు 28 ఏళ్ళు. కరెక్ట్ గా దాడికి ముందు షరీఫ్ తన ఎక్స్ లో గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేసిందని పోస్ట్ చేశాడు. షరీఫ్ చనిపోయిన వెంటనే ఈ పోస్ట్ ఎక్స్ లో కనిపించింది. తన చావును అతను ముందుగానే ఊహించి రాసాడని…ఆ తర్వాత వేరే ఫ్రెండ్ ద్వారా పోస్ట్ చేయబడిందని చెబుతున్నారు. నా పోస్ట్ కనుక మీరు చూస్తే అప్పటికే నా గొంతు అణివేయబడిందని మీరు భావించండి అంటూ అల్ షరీఫ్ పోస్ట్ లో రాశారు. మరోవైపు గాజాలో 22 నెలల యుద్ధంలో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరిగిన తాజా దాడి ఇదేనని, ఈ సంఘర్షణలో దాదాపు 200 మంది మీడియా ఉద్యోగులు మరణించారని మీడియా వాచ్‌డాగ్‌లు తెలిపాయి.
గాజా కథ ఏమిటి?
గాజాను వివిధ రాజవంశాలు, సామ్రాజ్యాలు మరియు ప్రజలు పాలించారు, నాశనం చేశారు మరియు తిరిగి జనాభా కల్పించారు. మొదట కనానైట్ స్థావరంగా ఉన్న ఇది, దాదాపు 350 సంవత్సరాల పాటు పురాతన ఈజిప్షియన్ల నియంత్రణలోకి వచ్చింది, తరువాత జయించబడి ఫిలిష్తీయుల ప్రధాన నగరాల్లో ఒకటిగా మారింది.
ఇజ్రాయెల్ గాజాపై ఎందుకు దాడి చేసింది?
ఇజ్రాయెల్ ప్రచారం నాలుగు లక్ష్యాలను కలిగి ఉంది: హమాస్‌ను నాశనం చేయడం, బందీలను విడిపించడం, గాజా ఇకపై ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించకుండా చూసుకోవడం మరియు ఉత్తర ఇజ్రాయెల్ నుండి స్థానభ్రంశం చెందిన నివాసితులను తిరిగి ఇవ్వడం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: