📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

News Telugu: Island: ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

Author Icon By Rajitha
Updated: December 18, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల సోషల్ మీడియాలో ఓ సముద్రం తెగ వైరల్ అవుతున్నది. సముద్రం ఎరుపెక్కిపోయింది. బీచ్ సమీపంలో ఎరుపురంగు నీళ్ల కెరటాలు వస్తుంటే ప్రజలు భయపడుతున్నారు. ఇది ప్రకృతి విపత్తుగా భావిస్తున్నారు. అయితే ఇది ప్రకృతి విపత్తుగానీ, ప్రమాదకరమైన ఘటన గానీ కాదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇరాన్ లోని హార్ముజ్ ద్వీపంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇరాన్ లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి బీచ్ లు, సముద్ర తీరాలు ఎరుపు లేదా రక్తం రంగులోకి మారాయి. చూసేందుకు ఇదేదో వింతగా కనిపిస్తుంది. దీంతో ప్రజలు తమ భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే సముద్రం నీరు ఎరుపుగా మారడం సహజమైనదని, ఎలాంటి ప్రమాదం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Read also: US Tariff: యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

హెమటైట్ అనే కెమికల్ కాంపౌండ్

హార్ముజ్ ద్వీపంలోని నేల, పర్వతాలు ఐరన్ ఆక్సైడ్ తో, హెమటైట్ అనే ఖనిజంతో సమృద్ధిగా ఉంటాయి. నీరు ఎరుపుగా మారేందుకు ఇది ఒక కారణమని నిపుణులు అంటున్నారు. ఎరుపుకు కారణం కూడా ఇదే.. హెమటైట్ (Hematite) అనే కెమికల్ కాంపౌండ్ భూమిపై ఎరుపురంగును కలిగించే సహజ ఐరన్ ఆక్సైడ్. ఇది సాధారణంగా ఇనుము తప్పు పట్టినప్పుడు కనిపించే లక్షణంతో సమానంగా ఉంటుంది. ఇదే ఖనిజం అంగారక గ్రహం ఉపరితలంపై కనిపించే ఎరుపురంగుకు కూడా కారణం. భారీ వర్షాలు పడినప్పుడు, నీరు ఇనుము అధికంగా ఉన్న పర్వతాలు, నేల గుండా ప్రవహిస్తూ హెమటైట్ కణాలను కొట్టుకెళ్లి సముద్రతీరానికి తీసుకువస్తుంది. ఫలితంగా సముద్రపు నీరు, ఇసుక ఎరుపురంగులోకి మారతాయని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Red Sea Phenomenon Telugu News Viral Beach Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.