📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Islamabad: బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు

Author Icon By Rajitha
Updated: January 8, 2026 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్ భారత్ పై తీవ్రకక్షను పెంచుకుంది. సింధునది జలాల విషయంలో భారత్ రాజీ లేకుండా తన నిర్ణయంపై కట్టుబడి ఉంది. దీంతో పాక్ ఏవిధంగానైనా భారత్ న దెబ్బకొట్టాలని చూస్తున్నది. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో భారత్-బంగ్లాల మధ్య బంధాలకు బీటలు వారుతున్నాయి. దీంతో పాక్ బంగ్లాతో (Bangladesh) రక్షణ బంధాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ రెండు దేశాలమధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది.

Read also: US Denmark talks: గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు | ట్రంప్ వ్యాఖ్యలపై ఉద్రిక్తత

Growing defense ties between Bangladesh and Pakistan

అయితే ఈ విమానాల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్, పాకిస్థాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ కలిపి అభివృద్ధి చేసిన జేఎఫ్-17 థండర్ ఒకే ఇంజిన్ తో పనిచేసే తేలికపాటి యుద్ధ విమానం. భారత్ తో జరిగిన ఇటీవలికాల ఉద్రిక్తతల్లో ఈ విమానం సామర్థ్యాన్ని నిరూపించిందని పాకిస్థాన్ చెబుతున్నా, దాని ప్రభావంపై నిపుణుల మధ్య ఇంకా స్పష్టత లేదని రక్షణ విశ్లేషకులు అంటున్నారు. మే 7 నుంచి 10వరకు జరిగిన భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తల్లో పాకిస్థాన్ ప్రధానంగా చైనా తయారీ జే-10 యుద్ధ విమానాలను ఉపయోగించినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి.

ఇస్లామాబాద్ లో జరిగిన రక్షణ బృందం సమావేశం

బంగ్లాదేశ్ వైమానికి దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మహ్మద్ ఖాన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి రక్షణ బృందం మంగళవారం ఇస్లామాబాద్ లోని ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లో పాకిస్థాన్ వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిధును కలిసింది.
ఈసమావేశంలో శిక్షణ, సామర్థ్యవృద్ధి, అంతరిక్ష రంగంలో సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగాయని పాకిస్థాన్ సైన్యపు మీడియా విభాగం ఐఎన్ పీఆర్ తెలిపింది. జేఎఫ్-17 యుద్ధ విమానాల కొనుగోలు అవకాశాలపై కూడా విస్తృతంగా మాట్లాడినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది బంగ్లాదేశ్ బృందం పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన కీలక కేంద్రాలను కూడా సందర్శించింది. ప్రాథమిక శిక్షణ నుంచి అధునాతన స్థాయి వరకు బంగ్లాదేశ్ వైమానిక దళానికి పూర్తి స్థాయి శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ ముష్షక్ శిక్షణ విమానాలను వేగంగా అందజేస్తామని, దీర్ఘకాలిక సాంకేతిక సహకారం కూడా ఉంటుందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

air force bangladesh Defence JF-17 Thunder latest news Pakistan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.