📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: పాకిస్తాన్ కీలక బాధ్యతల్లోకి ఐఎస్ఐ ఛీఫ్..!

Author Icon By Vanipushpa
Updated: May 1, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాశ్మీర్ లో పహల్గాం తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైకి యుద్ధానికి సై అంటూ బీరాలు పలుకుతున్నా… ఓసారి పోరు మొదలైతే దాన్ని ఎలా తట్టుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
జాతీయ భద్రతా సలహాదారుగా
ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఛీఫ్ గా వ్యవహరిస్తున్న మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ ను జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ లో ఐఎస్ఐ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఆసిమ్ మాలిక్ కు సైన్యంలో ఉన్న విస్తృత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా సలహాదారుగా నియమిస్తూ షెహబాజ్ షరీఫ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

సమస్యలను సమర్ధంగా ఎదుర్కొన్న అనుభవం
ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్‌గా పనిచేయడానికి ముందు ఆసిమ్ మాలిక్.. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ప్రధాన కార్యాలయంలో అడ్జుటెంట్ జనరల్‌గా పనిచేశారు. అలాగే చట్టపరమైన , క్రమశిక్షణా విషయాలతో సహా సైనిక పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించారు. అడ్జుటెంట్ జనరల్‌గా ఆయన పదవీకాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలలో మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టు సహా పలు కీలక ఘటనలు ఉన్నాయి. వీటిని సమర్ధంగా ఎదుర్కొన్న అనుభవం ఉండటంతో ఆయన్ను భద్రతా సలహాదారుగా నియమించినట్లు తెలుస్తోంది.
భారత్ తమపై సైనిక దాడి
పాకిస్తాన్ లో భద్రతా పరంగా సవాళ్లతో కూడిన బెలూచిస్తాన్, దక్షిణ వజీరిస్తాన్ ప్రావిన్స్ లలో పనిచేసిన అనుభవం ఆసిమ్ మాలిక్ కు ఉంది. ప్రస్తుతం భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకపోయినా నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ నిత్యం కాల్పులు జరుపుతూనే ఉంది. అలాగే వచ్చే 24-36 గంటల్లో భారత్ తమపై సైనిక దాడి చేయొచ్చని తమకు పక్కా నిఘా సమాచారం ఉందంటూ పాకిస్తాన్ మంత్రి అతావుల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసిమ్ మాలిక్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read Also: Fans: క్రికెట్ చూసేందుకు వచ్చిన పాక్ అభిమానులు మిస్సింగ్

in Pakistan..! ISI chief takes on key responsibilities

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.