📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Latest News: Russia: పాక్ కు రష్యా నిజంగానే సహకరిస్తోందా.. క్లారిటీ ఇచ్చిన పుతిన్?

Author Icon By Anusha
Updated: October 5, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫైటర్ జెట్ ఇంజిన్ల విషయంలో రష్యా-పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది అని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై దేశ రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. ప్రతిపక్ష పార్టీలు.. అధికార పక్షంపై దుమ్మెత్తిపోశాయి. 

భారత్ తమకు చిరకాల మిత్రుడని చెబుతూనే పాకిస్థాన్ తో రష్యా (Russia) వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, యుద్ధ విమానాలకు ఇంజన్లు సరఫరా చేస్తోందని జరుగుతున్న ప్రచారాన్ని వ్లాదిమిర్ పుతిన్ (Putin) కొట్టిపారేశారు.

America: అమెరికా లో సైనికులు గడ్డాలు పెంచుకోవడంపై నిషేధం?

భారతదేశానికి ఇబ్బందికరంగా మారే చర్యలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టబోమని స్పష్టం చేశారు. యుద్ధ విమానాల సరఫరా కోసం పాకిస్థాన్ (Pakistan) తో తాము ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని పేర్కొన్నారు.

భారత్‌తో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో.. పాక్‌కు మద్దతుగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారాలు చేయడం సరికాదని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే..

Russia

ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.పాకిస్థాన్ సైన్యం వాడుతున్న జేఎఫ్ -17 ఫైటర్ జెట్ల (చైనా తయారీ) కు అవసరమైన ఇంజన్లను రష్యా సరఫరా చేస్తోందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.

ప్రధాని మోదీ రష్యాను అత్యంత సన్నిహితమైన వ్యాపార భాగస్వామిగా

ఈ నివేదికలను ఉటంకిస్తూ.. బీజేపీపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ప్రధాని మోదీ రష్యాను అత్యంత సన్నిహితమైన వ్యాపార భాగస్వామిగా చెబుతారని, కానీ ఆ దేశం మన శత్రు దేశమైన పాక్‌కు మద్దతిస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ (Jairam Ramesh) ఆరోపించారు.ఇది ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తుందని విమర్శించారు.

జాతీయ ప్రయోజనాల కంటే ప్రధాని మోదీ తనకు పేరు వచ్చే విషయాలకే ప్రాధాన్యతనిస్తారని దుయ్యబట్టారు. రష్యా ఎందుకు పాక్‌కు సహకారాన్ని అందిస్తుందో మోదీ ప్రభుత్వం వివరించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ ఇప్పటికీ దౌత్యం విషయంలో పాక్‌ను ఒంటరిని చేయలేకపోతున్నారని జైరాం రమేశ్ విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News defense deal news fighter jet controversy india pakistan russia news latest news russia clarifies pakistan agreement russia pakistan fighter jet deal Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.