Trade deal: వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

Read Time:  1 min
వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?
వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?
FONT SIZE
GET APP

గత కొన్నేళ్లుగా భారతదేశం తన చమురు అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోళ్లను తగ్గించి.. దానికి బదులుగా వెనిజులా(Venezuela) , అమెరికా నుండి చమురును దిగుమతి చేసుకోవాలని ట్రంప్ యంత్రాంగం భారత్‌పై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందం (Trade deal) మన ఇంధన భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఇప్పుడు చూద్దాం. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. కానీ, భారత్ మాత్రం తన వినియోగదారుల ప్రయోజనాల కోసం రష్యా నుండి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. గత ఏడాది (2024-25) గణాంకాల ప్రకారం.. భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో 36% వాటా రష్యాదే. అయితే ట్రంప్ రాకతో ఈ పరిస్థితి మారుతోంది. రష్యా వార్ మెషీన్‌ కు నిధులు సమకూరుస్తున్నారంటూ భారత్‌పై విమర్శలు చేస్తూనే, వెనిజులా వైపు మొగ్గు చూపాలని ఆయన సూచిస్తున్నారు.

Read Also: Weather: ఫిబ్రవరి నెల చివరి వరకు కొనసాగనున్న చలి

Trade deal: వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?
Trade deal: వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

పాత బంధం.. కొత్త ఆశలు!

ఒక దశాబ్దం క్రితం భారత్ వెనిజులా నుండి భారీగా చమురును దిగుమతి చేసుకునేది. 2013లో దాదాపు $13 బిలియన్ల విలువైన చమురును కొన్నాం. కానీ అమెరికా ఆంక్షల వల్ల అది 2024 నాటికి కేవలం 0.3 శాతానికి పడిపోయింది. ఇప్పుడు వెనిజులాలో రాజకీయ మార్పులు రావడం, అక్కడ ట్రంప్ అనుకూల వాతావరణం ఏర్పడటంతో మళ్ళీ అక్కడి నుండి చమురు తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా మాట్లాడుతూ.. “భారత్ ఇకపై రష్యాకు బదులుగా వెనిజులా నుండి చమురు కొంటుంది” అని ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకమైన ఒప్పందాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం. రిలయన్స్ వంటి దిగ్గజాలకు పండగే! వెనిజులా నుండి వచ్చే ముడి చమురు చాలా ‘హెవీ’గా ఉంటుంది. దీనిని శుద్ధి చేయాలంటే అత్యాధునిక రిఫైనరీలు కావాలి. భారత్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి అటువంటి సామర్థ్యం ఉంది. గతంలో కూడా రిలయన్స్ వెనిజులా నుండి పెద్ద ఎత్తున చమురును కొనేది. ఇప్పుడు అమెరికా ఆంక్షలు సడలిస్తే, తాము మళ్ళీ వెనిజులా ఆయిల్ కొనడానికి సిద్ధమని రిలయన్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. దీనివల్ల మన దేశానికి చమురు సరఫరాలో వైవిధ్యం రావడమే కాకుండా ఇంధన భద్రత కూడా లభిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.