📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Israel-Iran :ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్య సాయం?

Author Icon By Sudha
Updated: June 20, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌(Iran )కు చైనా (China)గుప్తంగా ఆయుధాలను (Weapons)పంపుతున్నట్లు పలు విదేశీ నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం (Israel Iran War) ఎనిమిదో రోజుకు చేరింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగించింది. ప్రతిగా క్లస్టర్‌ బాంబులతో కూడిన క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి టెహ్రాన్‌ ఎక్కుపెట్టింది. రెండు దేశాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Israel-Iran :ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్య సాయం?

రహస్యంగా ఆయుధాలు
ఇక ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌ ఒంటరైంది. ఈ క్రమంలో ఇరాన్‌కు చైనా సాయం చేస్తున్నట్లు (China secretly helping Iran) తెలిసింది. ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్యంగా ఆయుధాలు పంపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మూడు మిస్టరీ కార్గో విమానాలను టెహ్రాన్‌కు పంపినట్లు తెలిసింది. ఈనెల 14 నుంచి మూడు బోయింగ్‌-747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి టెహ్రాన్‌ వైపు వెళ్లినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి.
బోయింగ్‌ విమానం
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట గత శుక్రవారం దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే అంటే శనివారం తొలి బోయింగ్‌ విమానం ఇరాన్‌వైపు వెళ్లింది. ఆ తర్వాత ఆదివారం రెండో విమానం, సోమవారం మూడో బోయింగ్‌ విమానం చైనా నుంచి బయల్దేరి వెళ్లాయి. ఈ రకమైన బోయింగ్ 747లను భారీ సైనిక పరికరాలను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు.
సైనిక పరికరాలు
ఈ మూడు విమానాలూ కజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తుర్క్మెనిస్థాన్‌ వైపు నుంచి ఇరాన్‌ సమీపంలోని వెళ్లాయి. ఆ తర్వాత అవి రాడార్‌ నుంచి కనిపించకుండా పోయాయి. మూడు విమానాల తుది గమ్యస్థానం లక్సెంబర్గ్‌గా ఉన్నప్పటికీ అవి అక్కడికి వెళ్లలేదు. దీంతో అవి ఇరాన్‌ వైపు వెళ్లి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్యంగా కార్గో విమానాల్లో సైనిక పరికరాలు సాయంగా పంపుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Read Also:Warning : అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్

#BallisticMissileFuel #ChinaIranArms #DualUseConcern #MiddleEastTensions #StealthSupply Breaking News in Telugu Google news Iran in its war with Israel? Is China secretly helping Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.