📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

WhatsApp: ఇరాన్ ప్రభుత్వ హెచ్చరిక: “వాట్సాప్‌ను వెంటనే తొలగించండి!”

Author Icon By Shobha Rani
Updated: June 18, 2025 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమ దేశ ప్రజలు తక్షణమే తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ (WhatsApp)ను తొలగించాలని ఇరాన్ (Iran) ప్రభుత్వం సంచలన సూచన చేసింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్(WhatsApp) సేకరించి, ఇజ్రాయెల్‌కు చేరవేస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ద్వారా విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్ర ఆరోపణలు చేసింది.
అధికారిక ప్రకటనతో సంచలనం
అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట ఆధారాలను ఇరాన్ ప్రభుత్వం బయటపెట్టలేదు. తమ దేశానికి చెందిన కీలక నాయకులు, శాస్త్రవేత్తల కదలికలను సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్న ఇజ్రాయెల్, వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని ఇరాన్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆరోపణల వెనుక ఏముంది?
ఈ ఆరోపణలపై వాట్సాప్ (WhatsApp) మాతృ సంస్థ మెటా స్పందించింది. “ఇలాంటి నిరాధారమైన ఆరోపణల ద్వారా భవిష్యత్తులో మా సేవలను ప్రజలకు అందకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన చెందుతున్నాం. మేము యూజర్ల లొకేషన్లను ట్రాక్ చేయము. వారి కార్యకలాపాలకు సంబంధించిన లాగ్‌లను కూడా మేం నిర్వహించము. వ్యక్తిగత సందేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చూడము. ఏ ప్రభుత్వంతోనూ పెద్ద మొత్తంలో సమాచారాన్ని పంచుకోము” అని వాట్సాప్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఫోన్ ట్రాకింగ్‌తో హత్యలు?
తమ దేశానికి చెందిన కీలక సైనిక జనరళ్లు, అణు శాస్త్రవేత్తలను హతమార్చేందుకు ఇజ్రాయెల్ వారి సెల్‌ఫోన్లను ట్రాక్ చేస్తోందని ఇరాన్ (Iran) ఇంటర్నేషనల్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. గతంలో ఇస్మాయిలీ హనియే అనే వ్యక్తిని కూడా టెహ్రాన్‌లో ఇదే విధంగా హత్య చేశారని గుర్తు చేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినప్పటికీ, అవి తమ లొకేషన్‌ను శత్రువులకు చేరవేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ గూఢచర్య వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికి యాంటీ-ట్రాకింగ్ పరిజ్ఞానం ఉన్న ఫోన్లు వాడాలని సూచించింది.
ఇజ్రాయెల్-ఇరాన్ డిజిటల్ యుద్ధం
ఇటీవల ఇరాన్ (Iran) రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో అత్యంత సీనియర్ సైనికాధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి సన్నిహిత సలహాదారు అయిన అలీ షాద్మానీ మరణించినట్లు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు ప్రకటించాయి. గతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సీనియర్ సైనికాధికారి అలీ రషీద్

WhatsApp: ఇరాన్ ప్రభుత్వ హెచ్చరిక: “వాట్సాప్‌ను వెంటనే తొలగించండి!”

మరణించడంతో ఆయ‌న‌ స్థానంలో అలీ షాద్మానీని ఇటీవలే యుద్ధ సమయంలో దళాల అధిపతిగా ఖమేనీ నియమించారు. షాద్మానీ ఒక రహస్య ప్రదేశంలో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దళాలు ఆయనను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం గమనార్హం. గూఢచార సమాచారం కోసం టెక్ యాప్‌లు లక్ష్యం కావడమై రెండు దేశాల మధ్య విస్తృత డిజిటల్ యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఇరాన్ పౌరులు, అధికారులు అనుమానిత యాప్‌లను తొలగించుకోవాలని సూచిస్తోంది.

Read Also: Mohsen: అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫఖ్రిజాదే హత్య వెనుక మొస్సాద్!

"Delete WhatsApp immediately!" #telugu News Breaking News in Telugu DigitalSurveillance Google news Google News in Telugu Iranian government warning: IranWhatsAppBan Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news WhatsAppSpyAllegations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.