📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Burj Khalifa: బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ డ్రోన్ దాడులు?

Author Icon By Anusha
Updated: March 1, 2026 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Iranian drone attacks on Burj Khalifa?

Burj Khalifa: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్, ఇప్పుడు తన ప్రతికారాన్ని ఊహించని రీతిలో తీర్చుకుంటోంది. ఏకంగా అమెరికా, ఇజ్రాయెల్ సహా మరో 10 దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. పశ్చిమాసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ రక్షణ దళాలు తమ వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన క్షిపణులను ఏకకాలంలో ప్రయోగించడం గమనార్హం.

Read Also: Shamshabad Airport: యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు

దుబాయ్‌లో డ్రోన్ల కలకలం.. బుర్జ్ ఖలీఫాపై దాడి?

ఏకంగా ఒకే సారి అమెరికా, ఇజ్రాయెల్ సమా 10 దేశాలపై బాలిస్టన్ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ క్రమంలో దూబయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తమైన భవనం సమీపంలో డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో డ్రోన్‌లు బుర్జ్‌ ఖలీఫాన్ ఢీకొట్టాయని ప్రచారం కూడా జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వైరల్‌ వీడియోలో బుర్జ్ ఖలీఫా సమీపంలో నుంచి ఇరానియన్ డ్రోన్ వెళ్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు.

అలాగే వీడియో బుర్జు ఖలీఫా సమీపంలో నల్లటి పొగ ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా మంది దుబాయ్‌లోని ఐకానిక్ టవర్‌ అయిన బుర్జు ఖలీఫా దాడికి గురైందని అనుకుంటున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు బుర్జ్‌ ఖలీఫాపై ఎలాంటి దాడి జరినట్టు అధికారులు పేర్కొనలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ballistic Missile attack on 10 countries Drone attack Israel Iran War 2026 Viral video Burj Khalifa attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.