📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hormuz Tensions: ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

Author Icon By Vanipushpa
Updated: March 11, 2026 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా భగ్గముంటోంది. దాడులు, ప్రతిదాడులతో భయానకంగా మారింది. దీంతో అంతర్జాతీయంగా ఆందోళన ఎక్కువవుతోంది. చమురు ధరలు నింగిని తాకుతున్నాయి. గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హోర్ముజ్ (Hormuz) జలసంధిని నియంత్రిస్తే ఇరాన్(Iran) పదం లేకుండా చేస్తామని హెచ్చరించారు. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. మీ పిల్ల బెదిరింపులకు ఇరాన్ భయపడే ప్రశ్నేలేదని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటుగా బదులిచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

Read Also: Hormuz Strait: హర్మూజ్‌ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

Hormuz Tensions: Not a single drop of oil will come out..Warning to Trump

యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో నిర్ణయించేది మేమే

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మైనింగ్ చేస్తే తీవ్ర సైనిక పరిణామాల ఎదురవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. జలమార్గాన్ని అడ్డుకోవడాన్ని ఇరాన్ ప్రయత్నిస్తే, అమెరికా దాన్ని స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. వారు ఏదైనా చెడుగా చేస్తే ఇరాన్ అంతం అయినట్టే. ఇకపై ఇరాన్ పేరునే వినబడదని ట్రంప్ అన్నారు. హోర్ముజ్ ద్వారా చమురు రవాణా ఇప్పటికే నష్టపోయినదానికన్నా 20 రెట్లు నష్టం కలిగిస్తాం అని పేర్కొన్నారు. ఇరాన్ ఈ వార్నింగ్ కు ఘాటుగా రిప్లై ఇచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మాపై కొనసాగితే హోర్ముజ్ ద్వారా ఒక్క లీటర్ చమురును కూడా రవాణాకు అనుమతించమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) స్పష్టం చేసింది. అమెరికా కాదని ఐఆర్‌జీసీ పేర్కొంది. కొత్త సుప్రీం నాయకులు భయపడరు, అమెరికా బెదిరింపులకు ప్రతిఘటన చూపుతుందని హెచ్చరించింది. మీరు ముందే జాగ్రత్త పడకపోతే, అమెరికా అనుకున్నది సాధ్యం కాదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిహెచ్చరించారు. చమురు మార్కెట్లపై ఈ యుద్ధ ప్రభావం తీవ్రమైంది. హోర్ముజ్ ద్వారా రవాణా అవుతున్న చమురు నిల్వలు నిలిచిపోవడంతో, బ్రెంట్, WTI క్రూడ్ ధరలు భారీగా ఎగబాకాయి.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Crude Oil Prices Donald Trump energy crisis Global Oil Supply Iran warning middle east conflict Strait of Hormuz Telugu News online Telugu News Today us iran tension

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.