📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Netanyahu death rumours : యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

Author Icon By Sai Kiran
Updated: March 15, 2026 • 7:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Netanyahu death rumours : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ నెతన్యాహూ ఇంకా బతికే ఉంటే వేటాడి మరీ చంపుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించడం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

గత కొన్ని రోజులుగా నెతన్యాహూ బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన మరణించారనే పుకార్లు సోషల్ మీడియాలో విస్తరించాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఆయన కార్యాలయం లేదా నివాసం దెబ్బతిన్నట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి.

అంతేకాకుండా నెతన్యాహూ అధికారిక ఎక్స్ ఖాతాలో వచ్చిన ఒక వీడియోపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ వీడియోలో ఆయన వేళ్లు అసాధారణంగా కనిపిస్తున్నాయని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన వీడియో కావచ్చని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.

Read also: Srikalahasti Temple: శివయ్య ప్రసాదాల తయారీకి ‘గ్యాస్ సెగ’

Netanyahu death rumours

ఈ పుకార్ల మధ్య ఇరాన్ సైనిక విభాగమైన రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. చిన్న పిల్లలను హత్య చేసిన నేరస్తుడిని వదిలిపెట్టబోమని, అతను బతికే ఉంటే పూర్తిస్థాయిలో వెంబడించి అంతం చేస్తామని హెచ్చరించింది.

ఇజ్రాయెల్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని, ఆ దేశ నాయకత్వం ప్రాణభయంతో తలదాచుకుంటోందని కూడా ఇరాన్ విమర్శించింది.

అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నెతన్యాహూ సురక్షితంగా ఉన్నారని, ఆయన తన విధుల్లోనే కొనసాగుతున్నారని అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఇటీవల ఆయన భద్రతా సమావేశంలో పాల్గొన్న ఫోటోలను కూడా విడుదల చేసి పుకార్లను ఖండించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu iran israel conflict news today iran israel tension latest news Iran Israel war latest update iran revolutionary guards statement iran warning netanyahu news israel pm netanyahu latest news middle east war news update netanyahu alive rumours news netanyahu death rumours news netanyahu office response rumours Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.