ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు (Iran-Israel War) ముదిరిన నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల (Indians) భద్రతపై కేంద్ర ప్రభుత్వం చురుకుగా స్పందించింది. తాజా పరిస్థితిని సమీక్షించిన భారత విదేశాంగ శాఖ, అక్కడి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే చర్యలు ప్రారంభించింది.
ఆర్మేనియాలో నుంచి ప్రత్యేక విమానం
ఈ చర్యల్లో భాగంగా, ఆర్మేనియాలో ఉన్న భారతీయ విద్యార్థులను ప్రత్యేక విమానంలో తరలించారు. మొదటి విడతగా 110 మంది విద్యార్థులు భారత్‌కి బయలుదేరారు. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందినవారిగా గుర్తించారు. విద్యార్థులంతా ఇరాన్ నుంచి సమీప దేశానికి తరలించబడి, అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా పంపబడుతున్నారు.
ఇరాన్ లోని భారతీయుల రక్షణకు చర్యలు
ఇరాన్ లో ఇంకా ఉన్న భారతీయులను కూడా అక్కడి ఇండియన్ ఎంబసీ సురక్షిత ప్రాంతాలకు తరలించిందని సమాచారం. ఎలాంటి హాని జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. పరిస్థితిని గమనిస్తూ అవసరమైతే మరిన్ని రిక్వీస్‌ట్ విమానాలు పంపించే అవకాశం ఉందని తెలిపింది.
Read Also : Gadwal : రైతులకు బేడీలు.. తెలంగాణ సర్కార్ సీరియస్