📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran War: అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ యుద్ధనౌకకు ఆశ్రయం!

Author Icon By Tejaswini Y
Updated: March 7, 2026 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Iran War: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమెరికా హెచ్చరికలను లెక్కచేయకుండా ఇరాన్ సైనికులకు, వారి యుద్ధనౌకకు కొచ్చి తీరంలో రక్షణ కల్పించింది. గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు లక్ష్యం చేసుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో భారత నౌకాదళ విన్యాసాల కోసం వచ్చిన ఇరాన్ నౌకలపై అమెరికా గురిపెట్టింది. మార్చి 4న శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన ‘ఐరిస్’ (IRIS) యుద్ధనౌకను అమెరికా పేల్చివేసింది. ఈ దాడిలో సుమారు 180 మంది సైనికులు ఉన్న నౌక ధ్వంసమైంది.

Read Also: Viral Video: ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్

Iran War: India gave America a big twist.. became a refuge for an Iranian warship!

భారత్ ఆశ్రయం

తమ మిగిలిన నౌకలకు కూడా ముప్పు పొంచి ఉందని భావించిన ఇరాన్ ప్రభుత్వం, రక్షణ కల్పించాల్సిందిగా ఫిబ్రవరి 28న భారత ప్రధాని మోదీని అభ్యర్థించింది. దీనికి సానుకూలంగా స్పందించిన భారత్, మార్చి 1న అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే 180 మంది సైనికులతో కూడిన ‘లవన్’ (Lavan) యుద్ధనౌక మార్చి 4 నుంచి కొచ్చి తీరంలో సురక్షితంగా ఆశ్రయం పొందుతోంది. ఒకవేళ భారత్ ఈ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే, అమెరికా ఈ నౌకను కూడా ధ్వంసం చేసి ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని కాదని ఇరాన్‌కు మద్దతు తెలపడంపై దేశీయంగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India Iran War News 2026 Indian Navy Kochi Coast Iran War IRIS Warship Attack Lavan Warship Kochi PM Modi Iran Support US Iran conflict

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.