Iran-US: హిందూ మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధనౌక ఐరిస్ దేనాపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఉత్తర పర్షియన్ గల్ఫ్‌లో ఒక అమెరికన్ ట్యాంకర్‌ను ఢీకొట్టినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాయిటర్స్ పేర్కొంది. అమెరికా నౌక మంటల్లో చిక్కుకుందని ఇరాన్ మీడియా తెలిపింది. శ్రీలంక తీరంలో ఐరిస్ దేనాపై జరిగిన దాడికి అమెరికా కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది.
Read Also: Iran: హార్ముజ్ జలసంధి సంక్షోభం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్న చమురు
ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న పోరు
ఇజ్రాయెల్, అమెరికా తమ లక్ష్యాలను చేరుకున్నాయని, ఈ నేపథ్యంలో ట్రంప్ ఎప్పుడైనా యుద్ధాన్ని ఆపివేయవచ్చని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ అధికారి ఇరాన్‌లో పాలకులు మారే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాలకులను మార్చుతామంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. శ్రీలంక సమీపంలో ఇరాన్ నౌకను అమెరికా ముంచివేయడం ఇరాన్‌కు పెద్ద దెబ్బగా మారింది. దీనికి ప్రతికారంగానే అమెరికా ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు సముద్ర మార్గాలకు పాకడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: