📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran Suicide Boat Attack: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

Author Icon By Saritha
Updated: March 12, 2026 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Iran Suicide Boat Attack: Suicide boat hits American oil tanker

Iran Suicide Boat Attack: పశ్చిమాసియా యుద్ధం.. ఇప్పుడు సముద్ర జలాల్లోకి కూడా పాకింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో.. తాజాగా ఒక అమాయక భారతీయ పౌరుడు బలయ్యాడు. పర్షియన్ గల్ఫ్‌లో ఇరాక్ తీరానికి సమీపంలో.. అమెరికాకు చెందిన చమురు ట్యాంకర్‌పై ఇరాన్ ఓ బోటుతో ఆత్మాహుతి దాడి జరిపింది. అయితే ఈ ఘటనలో ఓ భారతీయ నావికుడు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా ధృవీకరించగా.. భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Iran Allows Indian ships: హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

సూసైడ్ బోటుతో ఆత్మాహుతి దాడి

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చమురు సేకరిస్తున్న రెండు ట్యాంకర్లే లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది. అమెరికాకు చెందిన సేఫ్‌సీ విష్ణు, గ్రీస్‌కు చెందిన జెఫిరోస్ నౌకలు తీరంలో ఉండగా పేలుడు పదార్థాలతో నిండిన ఒక సూసైడ్ బోటు వేగంగా వచ్చి వాటిని ఢీకొట్టింది. ఈ ఘటనతో సముద్రం మధ్యలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈక్రమంలోనే రెండు నౌకల్లో ఉన్న 38 మంది సిబ్బందిని రెస్క్యూ టీం చాకచక్యంగా కాపాడగలిగింది. అయితే దురదృష్టవశాత్తూ ఒక వ్యక్తి మరణించగా అతడిని భారతీయ పౌరుడిగా గుర్తించారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దాడులు తామే చేశామని ఇరాన్ అధికారిక మీడియా ద్వారా గర్వంగా ప్రకటించుకోవడం గమనార్హం.

హార్మూజ్ జలసంధి మార్గం మూతపడటం, నిరంతరం సూసైడ్ బోట్లు, డ్రోన్ దాడులు జరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అస్తవ్యస్తం అయింది. అమెరికాకు చెందిన ఆస్తులను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ఈ దాడులు.. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నాశనం చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

attack Persian Gulf Indian sailor killed Iran Suicide Boat Attack Iran-US war US oil tanker

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.