ఇరాన్(Iran)లోని న్యూక్లియర్ సైట్లపై అమెరికా ఆర్మీ దాడులు (US Army Attacks) జరిపినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్ ప్రాంతాల్లో ఉన్న అణు కేంద్రాలపై విమానాల ద్వారా దాడులు జరిగినట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఫోర్డోలోని యురేనియం ఎర్రిచ్మెంట్ ఫెసిలిటీలో ఒక భాగం పూర్తిగా ధ్వంసమైందని, తీవ్ర నష్టం జరిగినట్టు Qom ప్రావిన్షియల్ క్రైసిస్ మేనేజ్మెంట్ అధికార ప్రతినిధి మోర్తజా హైదరీ తెలిపారు.
ప్రతిస్పందనకు సన్నద్ధమవుతున్న ఇరాన్ సైన్యం
దాడులకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి సమాచారం వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఇరాన్ వాయుసేన మరియు ఎయిర్ డిఫెన్స్ విభాగాలు స్పందించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇస్ఫహాన్, కాషాన్ ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తంగా ఉండి, ఎదురుదాడికి ఏర్పాట్లు చేస్తున్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలకు దారితీయవచ్చని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగే సూచనలు
ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలపై ఈ దాడులు జరగడం వల్ల అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా-ఇరాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముండగా, ప్రాంతీయ మిత్రదేశాల స్థితిగతులు కూడా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ తక్షణ ప్రతిస్పందనపై ఆసక్తికరమైన వేచిచూడు మూడ్ నెలకొన్నది.
Read Also : US Visa : త్వరలోనే వీసాల షెడ్యూలింగ్‌ను పునరుద్దరిస్తామన్న అమెరికా