📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran: ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​లోని ఇరాన్ ప్రతినిధి స్పందన

Author Icon By Vanipushpa
Updated: January 24, 2026 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్​ను నాశనం చేస్తానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హాకీం ఇలాహీ మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు కొత్తవి కాదని, అయినా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు భారత్​లో ఉన్న ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యకు పాల్పడితే ఇరాన్​ను అమెరికా నాశనం చేస్తుందని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు.

Read Also: Breaking News: అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య

Iran: ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​లోని ఇరాన్ ప్రతినిధి స్పందన

‘అంతర్జాతీయ ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపేశాం

మేం శాంతి, భద్రత కోరుకుంటున్నాం. కానీ కొందరు ఈ పరిస్థితిని సృష్టించారు. దీని వల్ల మొత్తం పశ్చిమాసియా నాశనం అవుతోంది. అన్ని దేశాలు ప్రభావితమవుతాయి. ఇరాన్ శత్రువులు బయట నుంచి యువతను రెచ్చగొడుతున్నారు. అందుకే అంతర్జాతీయ ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపేశాం. స్థానిక ఇంటర్నెట్ మాత్రం పనిచేస్తోంది. సోషల్ మీడియాను పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం. ఇరాన్‌(Iran)కు అనేక శత్రువులు ఉన్నారు. 250కి పైగా ఛానళ్లు 24 గంటలూ ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి’ అని డాక్టర్ అబ్దుల్ మజీద్ తెలిపారు.

అంతర్జాతీయ సంస్థలు ప్రపంచంలో తమ ప్రభావాన్ని కోల్పోయాయి

ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశంపై డాక్టర్ అబ్దుల్ మజీద్ స్పందించారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు ప్రపంచంలో తమ ప్రభావాన్ని కోల్పోయాని తెలిపారు. మరికొన్ని సంస్థలు కొన్ని దేశాల చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. అవి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, ప్రజలు, దేశాల ప్రయోజనాల కోసం పనిచేస్తాయని తాము అశిస్తున్నామని అన్నారు. ఇరాన్​ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి జనవరి 23న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

diplomatic reaction Donald Trump global political news India Iran Relations International Politics Iran response Middle East Politics Telugu News online Telugu News Today Trump Statements

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.