Iran Protests : ఇరాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ తీవ్రమవుతోంది. కరెన్సీ రియాల్ విలువ డాలర్‌తో పోలిస్తే భారీగా పడిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతుండగా, భద్రతా బలగాలు రంగంలోకి దిగి పలువురిని అరెస్టు చేశాయి. ఈ పరిణామాలు ఖమేనీ పాలనకు సవాల్‌గా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నిరసనలు ఎందుకు చెలరేగాయి?
ఇరాన్‌లో ఆదివారం నుంచి నిరసనలు మొదలయ్యాయి. (Iran Protests) రియాల్ విలువ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పడిపోవడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారాయి. దీంతో ఆర్థిక భారాన్ని భరించలేక ప్రజలు రోడ్లపైకి వచ్చారు. శాంతియుత నిరసనలు చట్టబద్ధమేనని ప్రభుత్వం చెబుతున్నా, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.
ఖమేనీ అధికారానికి ముప్పా?
ఈ నిరసనలు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారాన్ని కుదిపేసేలా మారుతాయా అన్న చర్చ మొదలైంది. అయితే ఖమేనీకి రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), భద్రతా బలగాలు, మతపరమైన సంస్థల నుంచి బలమైన మద్దతు ఉండటంతో ఆయన తక్షణం పదవి వదిలే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
Read also: EC: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు
ట్రంప్ పాత్ర ఉందా?
ఇరాన్ అణు కార్యక్రమం కారణంగా అమెరికా–ఇరాన్ సంబంధాలు ఎన్నాళ్లుగానో ఉద్రిక్తంగా ఉన్నాయి. ట్రంప్ పాలనలో ఇరాన్‌పై విధించిన కఠిన ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇతర దేశాలు ఇరాన్ చమురును కొనకుండా ఒత్తిడి చేయడం, ఇరానియన్ బ్యాంకులను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరుచేయడం వల్ల నిధుల ప్రవాహం నిలిచిపోయింది.
ఈ నిర్ణయాలే పరోక్షంగా ప్రస్తుతం ఇరాన్‌లో నిరసనలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖమేనీని అధికారం నుంచి తొలగించి, అమెరికాకు అనుకూలమైన నేతలను ముందుకు తీసుకురావాలనే కుట్ర ట్రంప్ వర్గాలు పన్నుతున్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
యుద్ధం, ఆరోగ్యం, అధికార పోరు
2025లో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధం ఇరాన్‌కు మరో భారీ దెబ్బగా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో రక్షణ వ్యవస్థలు, అణు కేంద్రాలు నష్టపోయాయి. ఖమేనీ ఇక అధికారంలో ఉండకూడదని ఇజ్రాయెల్ నేతలు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మరోవైపు 86 ఏళ్ల ఖమేనీ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు వార్తలు రావడంతో, ఆయన తర్వాత అధికారం ఎవరిది అన్న దానిపై ఇరాన్ పాలక వర్గాల్లో అంతర్గత పోరు మొదలైనట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: