📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

Iran Protests: అట్టుడుకుతున్న ఇరాన్.. ఘర్షణల్లో ఏడుగురు మృతి

Author Icon By Rajitha
Updated: January 2, 2026 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇశ్రాయేల్ హమాస్ లమధ్య యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఇరాన్ దేశంపై దాడి చేసింది. ఇశ్రాయేల్ కూడా ఇరాన్ (Iran) సుప్రీం నేత అయతుల్లా అతీ ఖమేనీ హతమార్చేందుకు ప్రయత్నించినప్పుడు దేశం మొత్తం ఆయనను కాపాడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ దేశ ప్రజలే ఖమేనీకి వ్యతిరేకంగా ఏకమై రోడ్లపై వచ్చి నిరసనలు చేస్తున్నది. గత రెండురోజులుగా ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు నగరాల్లో ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణంపై సామాన్య ప్రజానీకం వారం రోజులు కిందట మొదలుపెట్టిన పోరాటం క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.

Read also: Jahan Mazdani: న్యూయార్క్ మేయర్ గా మర్దనీ ప్రమాణస్వీకారం

ran is in turmoil

22ఏళ్ల మహసా అమీనిని అరెస్టు చేశారు

ఈ క్రమంలో కొత్త ఏడాది వేళ నిరసనలు ఉద్ధృతమై హింసకు దారితీసి వందలాదిమంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. యువతి మృతితో చెలరేగిన అల్లర్లు ఇరాన్ లో 2022 తర్వాత జరిగిన అతిపెద్ద నిరసనలు ఇవే. హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ ఇరాన్ మోరల్ పోలీసులు 22ఏళ్ల మహసా అమీనిని అరెస్టు చేశారు. కాగా ఆమె కస్టడీలో ఉండగా మరణించారు. దీంతో యువతలో ఆవేశం కట్టలు తెంచుకుని, వీధుల్లోకి వచ్చి హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలకు అంతర్జాతీయంగా ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి మద్దతు లభించింది. టెహ్రాన్ విశ్వవిద్యాలయం విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ‘ముల్లాహ్ లు దిగిపోవాలి’ ‘సర్వాధికారికి మరణం’ అంటూ నినదించారు.

ఈ మతృభూమికి స్వేచ్ఛ లభించదు..

‘ముల్లాహ్ సమాధి కప్పే వరకూ ఈ మతృభూమికి స్వేచ్ఛ లభించదు.. ముల్లాహ్ లు ఇరాన్ ను విడిచి వెళ్లాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నారు. 1979లో ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ ను పాలించిన షా మహమ్మద్ రెజా కుమారుడు పవీ రాజా పహ్లవీకి ఆందోళనకారులు మద్దతు తెలపడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాలో ప్రవాసం గడుపుతోన్న రెజా పహ్లావీ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ ‘మన పోరాటం న్యాయమైంది కాబట్టి మనదే విజయం’ అంటూ నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. ఆమెరికా డాలర్ విలువతో పోల్చితే ఇరాన్ కరెన్సీ రియాద్ విలువ సగానికి పడిపోవడం, ద్రవ్యోల్బణం ఏకంగా 42.5 శాతానికి చేరడంతో పౌరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డిసెంబరు 27న మొదటిసారి పలు నగరాల్లోని దుకాణదారులు వీధుల్లోకి వచ్చారు.

ఇందులో ప్రజలు భాగస్వాములుగా చేరడంతో ఉద్యమం మలుపు తిరిగింది. పారామిలటరీ బలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక అధికార మరణించగా మరో 13మంది గాయపడ్డారు. చర్చలు సిద్ధమన్న ప్రభుత్వం కాగా పరిస్థితి చేజారుతుండటంతో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకవైపు నిరసనలు అదుపుచేయడానికి చర్యలు చేపడుతునే పరిస్థితులను ఎప్పటికపుప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది మరోవైపు నిరసనకారులతో చర్చలకు సిద్ధమైంది. వర్తక సంఘాల ప్రతినిధులతో నేరుగా చర్చిస్తామని ఇరాన్ అధికార ప్రతినిధి ఫాతిమా మొహజెరానీ ప్రకటన చేశారు. ఉద్యమాన్ని అణచివేయడానికి కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. అలాగే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై 30 మంది అనుమానితులను టెహ్రాన్ లో అదుపులోకి తీసుకుంది. భద్రత, నిఘా వర్గాల సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ali Khamenei iran news Iran protests latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.