ఇరాన్‌లో కొనసాగుతున్న భారీ నిరసనలు తిరుగుబాటు స్థాయికి చేరుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(zelensky) వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు రష్యాపై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయంటూ ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలకు అంతర్జాతీయ రాజకీయాలపై విస్తృత ప్రభావం ఉంటుందని జెలెన్‌స్కీ తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో జెలెన్‌స్కీ మాట్లాడుతూ, “ఇప్పుడు ఇరాన్‌లో జరుగుతున్నది సాధారణ నిరసనలు కాదు. ఇవి పూర్తిస్థాయి తిరుగుబాటు. ఇది రష్యాకు ఇకపై పరిస్థితులు సులభంగా ఉండవని స్పష్టంగా చెబుతోంది. ఈ భూమిపై ఉన్న ప్రతి మంచి మనిషి కూడా, ఉక్రెయిన్‌కు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు ఎన్నో కష్టాలు తెచ్చిన ఈ పాలన నుంచి ఇరాన్ ప్రజలు విముక్తి పొందాలని కోరుకుంటున్నారు” అని అన్నారు.
Read Also: బంగ్లాలో మరో దారుణం.. హిందూ ఆటో డ్రైవరును చంపేశారు !
అంతర్జాతీయ సమాజానికి జెలెన్‌స్కీ పిలుపు
ఇరాన్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల పట్ల అంతర్జాతీయ సమాజం నిర్లక్ష్యం చేయకూడదని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. “మార్పు సాధ్యమయ్యే ఈ కీలక సమయంలో ప్రపంచం నిద్రపోకూడదు. ప్రతి దేశం, ప్రతి నాయకుడు, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చి ఇరాన్‌ను ఈ స్థితికి తీసుకొచ్చిన బాధ్యులను తొలగించేందుకు ప్రజలకు సహకరించాలి. అన్నీ మారవచ్చు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో నిరసనకారులపై ప్రభుత్వ బలప్రయోగాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ తీవ్రంగా ఖండించారు. “హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతున్న ఇరాన్ మహిళలు, పురుషులపై నిర్దాక్షిణ్యంగా జరుగుతున్న ప్రభుత్వ హింసను నేను ఖండిస్తున్నాను. మౌలిక స్వేచ్ఛలకు గౌరవం చూపడం ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన విలువ. ఆ స్వేచ్ఛల కోసం పోరాడుతున్న వారి పక్కనే మేం నిలుస్తాం” అని మెక్రాన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
ఇదిలా ఉండగా, ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా, అమెరికాతో చేసే అన్ని వ్యాపార లావాదేవీలపై 25 శాతం టారిఫ్ విధిస్తామని ఆయన ప్రకటించారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్, “ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే ప్రతి దేశం, అమెరికాతో చేసే ప్రతి వ్యాపారంపై 25 శాతం సుంకం చెల్లించాల్సిందే. ఈ ఆదేశం తుది నిర్ణయం, తిరస్కరించలేనిది” అని స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: