Iran protests: ఇటీవల జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. నిరసనల్లో పాల్గొన్న వేలాది మందిని అరెస్ట్ చేసిన ఇరాన్ ప్రభుత్వం, మొదట వందల మందికి మరణశిక్ష విధించేందుకు సిద్ధమైంది. అయితే అంతర్జాతీయ ఒత్తిడి, ముఖ్యంగా అమెరికా జోక్యంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ ప్రస్తుతం జైళ్లలో నిర్బంధంలో ఉన్న నిరసనకారులపై అమానుషంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు బయటకు వస్తున్నాయి.
ఇటీవల ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో వేలాది మంది (Iran protests) రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఉద్యమాలను అణిచివేసేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా స్పందించాయి. అధికారిక లెక్కల ప్రకారం, ఈ ఘర్షణల్లో సుమారు 500 మంది భద్రతా సిబ్బంది సహా 5,000 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇవి ధృవీకరించబడిన మరణాలేనని, వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని మానవ హక్కుల సంఘాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: IND vs NZ: టాస్ గెలిచిన న్యూజిలాండ్
గుర్తు తెలియని ఇంజెక్షన్లు, ఆరోపణలు సంచలనం
ఆందోళనల్లో పాల్గొన్న వేలాది మందిని ప్రస్తుతం ఇరాన్ జైళ్లలో నిర్బంధించారు. మరణశిక్షలను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, నిర్బంధ కేంద్రాల్లో మాత్రం ఖైదీలపై అమానుషంగా వ్యవహరిస్తున్నారని బ్రిటన్ మీడియా కథనాలు వెల్లడించాయి. జైళ్లలో బందీలను నగ్నంగా నిలబెట్టి, వారిపై పైపులతో చల్లని నీటిని చల్లుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు, ఖైదీలకు గుర్తు తెలియని ఇంజెక్షన్లు ఇస్తున్నారని, అవి ఏ మందులో, ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో కూడా తెలియడం లేదని కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ఇంజెక్షన్ల వల్ల ఖైదీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని, కొందరు మానసికంగా పూర్తిగా కుంగిపోయారని సమాచారం. ఈ ఆరోపణలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: