Gulf countries silence : ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణానంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాల వైపు ఇరాన్ క్షిపణి దాడులు జరుపుతున్నప్పటికీ, సౌదీ అరేబియా, యూఏఈ వంటి అరబ్ దేశాలు ప్రత్యక్ష ఎదురుదాడికి దిగకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ మౌనం వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను చమురు ఆధారిత విధానాల నుంచి పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడుల కేంద్రాలుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైతే, పెట్టుబడులు తగ్గిపోవడం, చమురు క్షేత్రాలు లక్ష్యంగా మారే ప్రమాదం ఉంది.
Read Also: Rohit Sharma: ఆ మ్యాచ్‌ను మించింది మరొకటి లేదు
రాజకీయంగా కూడా గల్ఫ్ దేశాలు జాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిలుస్తుండటంతో, నేరుగా యుద్ధంలోకి దిగితే తమ దేశీయ రాజకీయ సమీకరణాలపై ప్రభావం పడవచ్చని భావిస్తున్నాయి. అంతేకాకుండా ఇరాన్ ప్రేరేపణకు లోనవకుండా పరిస్థితిని నియంత్రణలో ఉంచాలన్న వ్యూహం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్యే ఈ వివాదం పరిమితం కావాలని, ప్రాంతీయ యుద్ధంగా మారకూడదన్నది గల్ఫ్ దేశాల ప్రధాన లక్ష్యంగా విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: