పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఖతార్, యూఏఈల్లోని అమెరికా నిర్వహిస్తున్న ఇంధన క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతార్ ఆర్థికవ్యవస్థకు పునాది అయిన రస్ లాఫాన్ ఎల్ఎన్జీ కేంద్రంపై జరిగిన దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఖతార్ (Qatar) ఎనర్జీ ధృవీకరించింది. ఇరాన్ రాయబారులు 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Maruti Suzuki Income Tax Notice: మారుతి సుజుకికి ఐటీ శాఖ నోటీసులు

24 గంటల్లోగా దేశం విడిచిపోవాలని ఆదేశం
రస్ లాఫాన్ దాడి తరువాత తెల్లవారుజామున పలు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కేంద్రాలు కూడా క్షిపణి దాడులకు గురయ్యాయని ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ తెలిపింది. దీంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవించి మరింత నష్టం వాటిల్లిందని పేర్కొంది. అగ్నిప్రమాదాలపై అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారుల ప్రకారం, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు అగ్నిప్రమాదాల్లో రెండింటిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం తెలిపింది. ఇంకా కూలింగ్, భద్రత చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇరాన్ చర్యలపై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. పౌర ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఘటనల నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ఇరాన్ ఎంబసీలోని సైనిక, భద్రతా అధికారులను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. వారిని 24 గంటల్లోగా దేశం విడిచిపోవాలని ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: