📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

Author Icon By Vanipushpa
Updated: March 11, 2026 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ భయానక రూపం దాలుస్తోంది. బుధవారం మార్చి 11న, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Dubai Airport) సమీపంలో రెండు అనుమానిత ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక భారతీయుడితో సహా మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇరాన్ కేవలం అమెరికాపైనే కాకుండా అమెరికా మిత్ర దేశాలపై కూడా విరుచుకుపడుతోంది. దుబాయ్ ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుండి దుబాయ్ విమానాశ్రయంపై దాడి జరగడం ఇది మూడవసారి.

Chhattisgarh :108 మంది మావోయిస్టుల సరెండర్.. పాపారావు లొంగుబాటుపై సస్పెన్స్

Dubai Airport: Iranian attacks on Dubai Airport.. Four injured

ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి

దుబాయ్ మీడియా కార్యాలయం సమాచారం ప్రకారం.. డ్రోన్ దాడులు జరిగినప్పటికీ విమాన రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే గతంలో మార్చి 1 , మార్చి 7 తేదీలలో జరిగిన దాడుల సమయంలో ఎమిరేట్స్ వంటి ప్రముఖ విమాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. తాజా దాడుల నేపథ్యంలో యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) క్షిపణి , డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్లు ప్రకటించింది. గాలిలో వినిపిస్తున్న శబ్దాలు మన వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులను అడ్డుకోవడం వల్ల వస్తున్నవేనని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Casualties in Dubai Drone Strikes Dubai Airport Attack Dubai International Airport News Global Aviation Safety Iran Missile Strike Iran vs UAE Latest News in Telugu Middle East conflict escalation Middle East Tensions 2026 Telugu News Paper UAE Security Crisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.