📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iranian Missile: ఇరాన్ మిస్సైల్ 4వేల కిలో మీటర్ల పరిధి..విస్తూపోయిన ప్రపంచం

Author Icon By Vanipushpa
Updated: March 21, 2026 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించే ప్రయత్నం. ఇదే ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు తన క్షిపణుల గరిష్ఠ పరిధి 2,000 కిలోమీటర్లేనని ప్రకటిస్తూ వచ్చిన ఇరాన్, హిందూ మహాసముద్రంలోని కీలక సైనిక స్థావరమైన డిగో గార్సియా(Diego Garcia)ను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా- బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ రెండు మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే ఈ దాడి పూర్తిగా విజయవంతం కాలేదు. ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి గాల్లోనే విఫలమవగా, మరొకదాన్ని అమెరికా యుద్ధనౌక సమర్థవంతంగా అడ్డుకున్నట్లు సమాచారం. దాడి లక్ష్యాన్ని చేరుకోకపోయినా, ఈ ఘటన ప్రాధాన్యం మాత్రం గణనీయంగా పెరిగింది.

Read Also: Diesel Hike: ఇరాన్ యుద్దం ఎఫెక్ట్ తో .. భారీగా పెరిగిన డీజిల్ ధరలు

Iranian Missile: Iranian missile has a range of 4 thousand kilometers..a world that is constantly changing

ఇరాన్ ప్రకటించని క్షిపణి సామర్థ్యాలు

కారణం- డిగో గార్సియా స్థావరం ఇరాన్ భూభాగం నుంచి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉండటం. ఇంతదూరంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఇరాన్ ప్రకటించని క్షిపణి సామర్థ్యాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇరాన్ ఇప్పటి వరకు తన బాలిస్టిక్ క్షిపణుల గరిష్ఠ పరిధి 2,000 కిలోమీటర్లకే పరిమితమని అధికారికంగా చెబుతూ వచ్చింది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే, ఆ దేశం వాస్తవానికి మరింత దీర్ఘ శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ మిసైళ్ల (IRBM) స్థాయికి చేరువలో ఉన్న సాంకేతికతను పరీక్షించి ఉండవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య ద్వారా ఇరాన్ కేవలం సైనిక శక్తిని ప్రదర్శించడం మాత్రమే కాకుండా వ్యూహాత్మక సందేశాన్ని కూడా పంపింది. తమ అసలు సామర్థ్యాలపై స్పష్టత ఇవ్వకుండా ప్రత్యర్థి దేశాలను అనిశ్చితిలో ఉంచడం ద్వారా మానసిక ఒత్తిడి సృష్టించడమే టెహ్రాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉన్న డిగో గార్సియా ప్రపంచంలోనే అత్యంత కీలక సైనిక స్థావరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

4000km Range Missile Ballistic Missiles Global Defense international security Iran Missile Test middle east conflict military technology Strategic Weapons Telugu News Paper Telugu News Today US-Iran Tension

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.