Iran Minister On Ceasefire: ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

Read Time:  1 min
ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం
ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం
FONT SIZE
GET APP

ఇరాన్ కాల్పుల విరమణ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను టెహ్రాన్ ఖండించింది. ఇరాన్ ఎప్పుడూ కాల్పుల విరమణ లేదా చర్చలను కోరలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ(Syed Abbas Araghchi) స్పష్టం చేశారు. అవసరమైతే ఎంతకాలమైనా తమ దేశాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. ‘అమెరికా చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ముగించే వరకు ఇరాన్ సైనిక చర్యను కొనసాగిస్తుంది. మేం ఎప్పుడూ కాల్పుల విరమణ కోరలేదు. చర్చలు కూడా కోరలేదు. అవసరమైతే ఎంతకాలమైనా మేము రక్షణ చర్యలు కొనసాగిస్తాం. మేం ఇప్పటికే వారితో చర్చలు జరుపుతున్న సమయంలోనే వారు మాపై దాడి చేశారు. అలాంటప్పుడు మళ్లీ ఎందుకు చర్చలు జరపాలి. వారితో మాట్లాడేందుకు మాకు ఎటువంటి కారమం కనిపించడం లేదు’ అని అరాగ్చీ తెలిపారు.

Strait of Hormuz: ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

Iran Minister On Ceasefire: We are ready to continue for any number of days
Iran Minister On Ceasefire: We are ready to continue for any number of days

అణ్వాయుధాలు తయారు చేయాలనే ఉద్దేశం లేదు

అమెరికా దాడుల కారణంగా తమ దేశంలోని అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయని, అందులోని అణు పదార్థం ప్రస్తుతం శిథిలాల కింద ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఆ పదార్థాన్ని వెలికితీసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం అలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేశారు. అవసరమైతే అంతర్జాకీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలోనే ఆ ప్రక్రియ జరగాలని ఇరాన్ భావిస్తుందని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన అణు చర్చల సమయంలో తమ దేశం పెద్ద రాజీకి సిద్ధమైందని అరాగ్చీ తెలిపారు. ఇరాన్ వద్ద ఉన్న 60 శాతం శుద్ధి చేసిన యురేనియాన్ని తక్కువ స్థాయికి తగ్గించడానికి సిద్ధమని అప్పట్లో ప్రతిపాదించామని చెప్పారు. ఇరాన్‌కు అణ్వాయుధాలు తయారు చేయాలనే ఉద్దేశం లేదని నిరూపించడానికే ఆ ప్రతిపాదన చేశామని ఆయన తెలిపారు.
మరోవైపు ఇరాన్‌ క్షిపణి సామర్థ్యాన్ని భారీగా దెబ్బతీశామని, 70 శాతానికి పైగా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.