📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran vs Israel War: ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

Author Icon By Vanipushpa
Updated: March 9, 2026 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాగా, ఇరాన్‌ ఆయిల్‌ డిపోలపై దాడుల గురించి ఇజ్రాయెల్ (Israel)ముందుగానే అమెరికాకు తెలియజేసింది. అయితే ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఇరాన్‌ చమురు నిల్వలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారని అమెరికా సీనియర్ అధికారి ఒకరు ‘యాక్సియోస్’తో అన్నారు. ‘ఇది అమెరికా అధ్యక్షుడికి నచ్చలేదు’ అని ట్రంప్‌ కార్యాలయం ఇజ్రాయెల్‌కు స్పష్టం చేసిందన్నారు. ‘వాట్‌ ద ఫ*’ పదజాలంతో ట్రంప్‌ ఆగ్రహంతో కూడిన సందేశాన్ని కూడా వైట్‌హౌస్‌ పంపినట్లు అమెరికా అధికారి తెలిపారు. ఇజ్రాయెల్‌ను ఈ మేరకు ట్రంప్‌ గట్టిగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

Read Also: West Asia War: పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Iran vs Israel War: Israeli attacks on Iranian oil reserves..

ప్రపంచ చమురు ధరలు పెరిగే పరిణామంపై ట్రంప్‌ ఆందోళన

మరోవైపు రోజువారీ పౌర వినియోగానికి సంబంధించిన సౌకర్యాలపై దాడులు ఊహించని పరిణామాలను కలిగిస్తాయని అమెరికా ఆందోళన చెందినట్లు ఆ అధికారి తెలిపారు. అలాగే ఇరాన్‌ ప్రభుత్వానికి ప్రజల మద్దతు కూడగట్టే అవకాశంతో పాటు ప్రపంచ చమురు ధరలు పెరిగే పరిణామంపై ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ‘ఈ దాడి అధ్యక్షుడికి ఇష్టం లేదు. ఆయన చమురును ఆదా చేయాలనుకుంటున్నారు. దానిని మండించేందుకు ఇష్టపడరు. ఇది అధిక గ్యాస్ ధరలను ప్రజలకు గుర్తు చేస్తుంది’ అని ట్రంప్ సలహాదారుడు అన్నట్లు ‘యాక్సియోస్‌’ పేర్కొంది. అయితే ఈ మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్, లేదా ఇజ్రాయెల్‌ సైన్యమైన ఐడీఎఫ్ నిరాకరించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ballistic Missile Strike Fattah Missile Iran Israel conflict Iran Military Action IRGC Operation True Promise 4 Israel Air Defense Systems Israel Casualties Khorramshahr Missile Khyber Missile Middle East war updates Tel Aviv Missile Attack Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.