ఇరాన్, ఇజ్రాయెల్ (Israel vs Iran) మధ్య ఉద్రిక్తతలు కొత్త మలుపు తిరిగాయి. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్ (Missiles on Israel) ప్రయోగించింది. ఈ దాడులను గుర్తించినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. రాకెట్‌లు తమ భూభాగం వైపు దూసుకొస్తుండటంతో, వెంటనే డిఫెన్స్ సిస్టమ్స్‌ను యాక్టివేట్ చేసి వ్యతిరేక దాడులకు సిద్ధమయ్యామని చెప్పారు.
సైరన్ల మోగింపు – టెల్ అవీవ్ అప్రమత్తం
ఈ క్షిపణుల ముప్పుతో టెల్ అవీవ్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్లు జారీ అయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, మిస్సైల్ దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్ నగరంలో సైరన్లు గట్టిగా మోగాయి. ప్రజలంతా ఆందోళనతో భయకంపితులవుతున్నారు.
ఇజ్రాయెల్ జరిపిన ముందస్తు దాడులకు బదులుగా..?
ఇరాన్ ఈ దాడులు జరపడానికి పూర్వాపరాలు కూడా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్‌లోని పలు మిలిటరీ స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణుల దాడికి దిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితి మరింత ఉధృతమవుతుండటంతో, ప్రపంచ దేశాలు శాంతికి పిలుపునిస్తున్నాయి.
Read Also : CCTV Camera : ఎస్సీ గురుకుల స్కూళ్లలో సీసీ కెమెరాలు