📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran Israel War: హర్మూజ్ జలసంధిలో నౌకలను ధ్వంసం చేస్తాం.. ఐఆర్​జీసీ

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) బుధవారం దాడులను పరాకాష్టకు తీసుకెళ్లింది. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాల లక్ష్యంగా 17వ విడత దాడులను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సైనిక చర్యకు ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’ అని నామకరణం చేసింది. తాజా దాడులతో గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు సమాచారం.

Read Also: MEA Helpline Numbers: భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు

హర్మూజ్ జలసంధిపై పట్టు మాదే.. ట్రంప్‌కు ఐఆర్​జీసీ కౌంటర్!

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. చమురు నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పిస్తుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఐఆర్​జీసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని, తమ అనుమతి లేకుండా ఈ మార్గంలో ప్రయాణించే ఏ నౌకనైనా ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ఆందోళన మొదలైంది.

అమెరికా యుద్ధనౌకపై దాడి.. 230 డ్రోన్లతో విధ్వంసం!

హిందూ మహాసముద్రంలో ఇంధనం నింపుకుంటున్న ఒక అమెరికన్ యుద్ధనౌకపై ఐఆర్​జీసీ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో యుద్ధనౌకతో పాటు ట్యాంకర్‌లోనూ మంటలు చెలరేగినట్లు ఇరాన్ పేర్కొంది. కువైట్, ఖతార్, ఇరాక్, యూఏఈలలోని అమెరికా స్థావరాల లక్ష్యంగా 230 డ్రోన్లను ప్రయోగించామని, ఇజ్రాయెల్‌పై 40 క్షిపణులను సంధించామని ఐఆర్​జీసీ స్పష్టం చేసింది. అగ్రరాజ్య వ్యూహాత్మక స్థావరాలే తమ ప్రధాన లక్ష్యమని ఇరాన్ బాహాటంగా ప్రకటించింది.

ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడిలో 680మందికిపైగా అమెరికన్ సైనికులు చనిపోయారని తమ నిఘా వర్గాలు తెలిపాయని ఐర్​జీసీ తెలిపింది. బహ్రెయిన్‌లోని ఒక కీలకమైన అమెరికా వైమానిక స్థావరం ఈ దాడుల్లో పూర్తిగా దెబ్బతిన్నదని, అక్కడి కమాండ్ సెంటర్లు ధ్వంసం కావడంతో ఆ బేస్ ప్రస్తుతం పనిచేయలేని స్థితికి చేరుకుందని ఇరాన్ స్పష్టం చేసింది.

Iran Israel War: We will destroy ships in the Strait of Hormuz.. IRGC

మరోవైపు అమెరికా కూడా ఈ దాడులను ఆపే ఉద్దేశం లేదని యూఎస్ కమాండ్ ఆడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌లో నిరంతరం దాడులు నిర్వహించాయని చెప్పారు. ,’మా బీ-2, బీ-1 బాంబర్లు ఇరాన్‌లోని పలు క్షిపణి కేంద్రాలపై కచ్చితమైన దాడులు జరిపాయి. గత రాత్రి బీ-52 బాంబర్ దళం బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ పోస్టులపై దాడి చేసింది.

ఇప్పటివరకు 17 ఇరానీ నౌకలను ధ్వంసం చేశాం. అరేబియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్క ఇరానీ నౌక కూడా సముద్రయానంలో లేదు. మేం ఇరాన్ మిగిలిన మొబైల్ బాలిస్టిక్ లాంచర్లను వెంబడిస్తున్నాం. ఇరాన్ ఇప్పటికే 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే ఇరాన్ ప్రతిదాడి సామర్థ్యం క్షీణిస్తోంది. మా సైనిక శక్తి పెరుగుతోంది’ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Iran IRGC Attacks US Navy Iran israel war Operation True Promise 4 Strait of Hormuz Crisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.