Iran Israel War: గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

Read Time:  1 min
Iran Israel War: గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి
FONT SIZE
GET APP

Iran Israel War: ప్రస్తుతం ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దేశంలో భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న వేళ.. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.ఇరాన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లోని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక్కడి తెలుగువారు భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే హెచ్చరికలు, భద్రతా సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు.

Read Also: Maoist Leader Abhay: అభయ్ కొత్త అడుగుఅడవిబాట నుంచి అన్న ఒడిక

Iran Israel War: Telugu people in Gulf countries should be alert: CM Revanth Reddy
Iran Israel War: Telugu people in Gulf countries should be alert: CM Revanth Reddy

రాయబార కార్యాలయాల సూచనలు తప్పనిసరి

ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పౌరులను క్షేమంగా వెనక్కి రప్పించేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అక్కడి ఎంబసీలతో టచ్‌లో ఉండాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థులు, ఇంజనీర్లతోపాటు బిజినెస్‌మెన్‌లు తరచూ హైదరాబాద్ నుంచి ఇరాన్‌కు రాకపోకలు సాగిస్తూ ఉంటారు.

ఇక ఇరాన్‌లో ఉన్న హైదరాబాదీలకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అక్కడి ప్రభుత్వం ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడంతో.. తమ వారి ఫోన్లు కూడా కలవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.