Iran-Israel war: ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో ఇరాన్ అగ్ర నాయకత్వం ఉపయోగించే ఒక కీలక విమానాన్ని ధ్వంసం, పలు సైనిక స్థావరాలను చేసినట్లు సోమవారం ప్రకటించింది. ఈ దాడితో ఇరాన్, దాని మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతింటుందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు తెలిపింది.
Read Also: Hard Rock: భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపాటు
ధ్వంసమైన విమానం ఎయిర్‌బస్ ఏ340. దీనిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, గతంలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వంటి అగ్ర నాయకులు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉపయోగించేవారు. టెహ్రాన్‌లోని ఈ విమానాశ్రయంలో దేశీయ విమానాలతో పాటు ఇరాన్ వైమానిక దళానికి చెందిన సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్ వంటి ఇతర నగరాల్లోని మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: