Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు: ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణించారా?

Read Time:  1 min
Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు: ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణించారా?
FONT SIZE
GET APP

Iran Israel War: ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాలపై ఇజ్రాయెల్ మరియు అమెరికా దళాలు భారీ దాడులకు దిగడంతో పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది. ఈ దాడుల్లో తాము ప్రధానంగా ఇరాన్ అగ్రనాయకత్వాన్ని (Top Leadership) లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఆకస్మిక దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థలు కకావికలమయ్యాయని, పలు వ్యూహాత్మక స్థావరాలు ధ్వంసమయ్యాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

Read Also: Iran-Israel War : గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్

ఖమేనీ మరణంపై అంతర్జాతీయ మీడియాలో కలకలం

ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ టెలివిజన్ ‘ఛానెల్ 12’, తమ వద్ద ఉన్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఖమేనీ మరణించారనడానికి బలమైన సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ వార్త ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, దీనితో ఇరాన్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Iran Israel War: Flames of war in West Asia: Is Iran's Supreme Leader Khamenei dead?
Iran Israel War: Flames of war in West Asia: Is Iran’s Supreme Leader Khamenei dead?

ఈ నివేదికల గురించి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నాకు తెలిసినంత వరకు ఖమేనీ ఇంకా బతికే ఉన్నారని అన్నారు. పెంటగాన్ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన దాడుల్లో ఇరాన్‌ రివల్యూషనరీ దళానికి చెందిన అనేక మంది సీనియర్ కమాండర్లు.. అధికార యంత్రాంగానికి చెందిన పలువురు అత్యున్నత స్థాయి అధికారులు చనిపోయినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే,. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.