Iran-Israel War: ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

Read Time:  1 min
Iran-Israel War: ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు
FONT SIZE
GET APP

Iran-Israel War: యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి నరకాన్ని చూసిన సుమారు 45 మంది విద్యార్థుల రెండో బృందం ఎట్టకేలకు ఢిల్లీ చేరుకుంది. ఇరాన్ నుంచి అర్మేనియా, అక్కడి నుండి దుబాయ్ మీదుగా సాగిన వీరి ప్రయాణం ఎన్నో మలుపులు, భయాల మధ్య సాగింది. సొంత దేశంలో అడుగుపెట్టాక వారు పంచుకున్న అనుభవాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

ఇరాన్ లోని ఉర్మియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న లబీబ్ ఖాద్రీ అనే విద్యార్థి తన భయంకర అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. బాంబుల మోతతో నగరం దద్దరిల్లుతుంటే, ఎప్పుడు తమ హాస్టల్ మీద బాంబు పడుతుందో అని భయంతో వణికిపోయేవారమని చెప్పాడు. దాదాపు రెండు వారాల పాటు హాస్టల్ బేస్‌మెంట్‌లోనే బందీలుగా బతికామని, కేవలం అత్యవసర వస్తువుల కోసం మాత్రమే గుంపులుగా బయటకు వచ్చేవారమని వివరించాడు.

Read Also: UNO: ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

Iran-Israel War: ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు
Iran-Israel War: 45 Students Arrive in Delhi from Iran

తల్లిదండ్రుల ఆనందబాష్పాలు

ఇరాన్ లోని ఉర్మియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న లబీబ్ ఖాద్రీ అనే విద్యార్థి తన భయంకర అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. బాంబుల మోతతో నగరం దద్దరిల్లుతుంటే, ఎప్పుడు తమ హాస్టల్ మీద బాంబు పడుతుందో అని భయంతో వణికిపోయేవారమని చెప్పాడు. దాదాపు రెండు వారాల పాటు హాస్టల్ బేస్‌మెంట్‌లోనే బందీలుగా బతికామని, కేవలం అత్యవసర వస్తువుల కోసం మాత్రమే గుంపులుగా బయటకు వచ్చేవారమని వివరించాడు.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వద్ద విద్యార్థుల రాక కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల కళ్లు కన్నీటితో నిండిపోయాయి. శ్రీనగర్‌కు చెందిన ఓ విద్యార్థిని తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుని, ఇరాన్‌లో తాము చూసిన భయానక దృశ్యాలను వివరిస్తుంటే అక్కడ ఉన్నవారంతా భావోద్వేగానికి గురయ్యారు. ప్రాణాలతో తిరిగొచ్చిన తమ బిడ్డలను చూసి ఆ తల్లులు ఆనందబాష్పాలు రాల్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.