Iran-Israel Conflict: మధ్యప్రాచ్యంలో ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు పవిత్ర రంజాన్ మాసపు ప్రశాంతతను దూరం చేశాయి. ఒకవైపు దూసుకొచ్చే మిస్సైళ్లు, మరోవైపు ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలియని బాంబుల మోతతో ఇరాన్ సహా గల్ఫ్ దేశాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఏడాది ముస్లిం సోదరులు పండుగ ఆనందాన్ని ఆస్వాదించలేక, ప్రాణభయంతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also:Kim Jong Un: ఉత్తర కొరియా వారసురాలు కిమ్ జు-యే? తండ్రితో కలిసి యుద్ధ విన్యాసాల్లో సందడి
ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
గడిచిన కొన్ని వారాలుగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఈ దాడులు ఇప్పటికే వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ విమానాలు విరుచుకుపడుతుండగా, ప్రతికారంగా ఇరాన్ తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై డ్రోన్ మరియు క్షిపణి దాడులకు దిగుతోంది. ఈ పరస్పర దాడులు పండుగ వేళ సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
Iran-Israel Conflict: ఈద్ వేడుకలపై యుద్ధ ప్రభావం
సాధారణంగా ఈద్ అల్-ఫితర్ వేడుకలను గల్ఫ్ దేశాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. దుబాయ్, కువైట్, బహ్రెయిన్ వంటి నగరాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ క్షిపణులను అడ్డుకుంటున్న శబ్దాల మధ్య ప్రజలు జాగారం చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలపై ఆంక్షలు విధించగా, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన దుస్థితి తలెత్తింది. వేడుకల సందడి పోయి, సైరన్ల మోతతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: