📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Iran: భారత్ వైఖరిపై హర్షం వ్యక్తం చేసిన ఇరాన్

Author Icon By Saritha
Updated: January 24, 2026 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో (UNHRC) తమ దేశానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించడంపై ఇరాన్ (Iran) హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు భారత్‌లోని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ శనివారం ప్రకటించారు. ఇది అన్యాయమైన, రాజకీయ ప్రేరేపిత తీర్మానమని, దీనిని వ్యతిరేకించడం ద్వారా భారత్ న్యాయం, బహుపాక్షికత, జాతీయ సార్వభౌమత్వానికి కట్టుబడి ఉందని చాటిందని ఆయన ప్రశంసించారు.

Read Also: US: చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

ఇరాన్‌లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్న భారత్

శుక్రవారం జరిగిన UNHRC 39వ ప్రత్యేక సమావేశంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. (Iran) గతేడాది డిసెంబర్ 28 నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఇరాన్ ప్రభుత్వం హింసాత్మకంగా అణచివేయడాన్ని ఈ తీర్మానం తీవ్రంగా ఖండించింది. ఈ అణచివేతలో వేలాది మంది పౌరులు, చిన్నారులు మరణించారని, అనేకమంది గాయపడ్డారని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 25 దేశాలు, వ్యతిరేకంగా 7 దేశాలు ఓటు వేయగా, 14 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ఇరాన్‌పై ప్రవేశపెట్టిన తీర్మానంతో అంతర్జాతీయ నిజనిర్ధారణ కమిటీ, ప్రత్యేక ప్రతినిధి పదవీ కాలాలను పొడిగించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ మంత్రి‌తో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే, ఇరాన్ పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లవద్దని, ఇప్పటికే ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని భారత్ పౌరులకు సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



India Iran Relations India Opposes UNHRC Resolution Iran Iran UNHRC Resolution Iranian Ambassador India Latest News in Telugu Mohammad Fathali Telugu News UNHRC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.