📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Operation Ajax: ఇరాన్ చరిత్రను ఆపరేషన్ ఎజాక్స్ పై మళ్ళీ చర్చ

Author Icon By Vanipushpa
Updated: January 17, 2026 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అమెరికా జోక్యం పట్ల పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో 72 ఏళ్ల క్రితం జరిగిన ‘ఆపరేషన్ ఎజాక్స్‘(Operation Ajax)అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా వ్యూహాలు రచిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో 1953లో అమెరికా, బ్రిటన్‌లు కలిసి ఇరాన్‌లో చేసిన కుట్ర ‘ఆపరేషన్ ఎజాక్స్’ గురించి చర్చ మొదలైంది. అసలు 1953లో ఏం జరిగింది? అమెరికాకు దీనితో ఉన్న సంబంధం ఏంటి? అసలేమిటీ ఆపరేషన్ ఎజాక్స్? 1950వ దశకంలో ఇరాన్ ప్రధానమంత్రిగా మొహమ్మద్ మొసాదేక్ ఉండేవారు. ఆయన ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు, తీవ్ర జాతీయవాది. ఇరాన్ చమురు నిక్షేపాలను బ్రిటీష్ కంపెనీల గుప్పిట నుంచి విడిపించి, వాటిని జాతీయం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

Read Also: Budget 2026: సామాన్యుడి జీవితంలోకి ఏఐ

Operation Ajax: ఇరాన్ చరిత్రను ఆపరేషన్ ఎజాక్స్ పై మళ్ళీ చర్చ

బ్రిటన్, అమెరికా దేశాలకు కంటగింపుగా..

ఇది బ్రిటన్, అమెరికా దేశాలకు కంటగింపుగా మారింది. వారి ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించి, మొసాదేక్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పన్నిన రహస్య వ్యూహమే ‘ఆపరేషన్ ఎజాక్స్’. మొసాదేక్ సోవియట్ యూనియన్ (రష్యా) వైపు మొగ్గు చూపుతారని, ఫలితంగా ఇరాన్ చమురు రష్యా వశమవుతుందని అమెరికా భయపడింది. అధికార మార్పిడి: మొసాదేక్‌ను తొలగించి అమెరికాకు అనుకూలంగా ఉండే మొహమ్మద్ రెజా పహ్లావీ (షా) ను పూర్తి అధికారంలోకి తీసుకురావడం.

ఇరాన్‌లో అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు

దేశంలో అల్లర్లు సృష్టించి, ప్రజలను మొసాదేక్‌కు వ్యతిరేకంగా ఉసిగొల్పాయి. ఆగస్టు 19, 1953న సైనిక తిరుగుబాటు ద్వారా మొసాదేక్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మొహమ్మద్ మొసాదేక్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆయన 1967లో గృహనిర్బంధంలోనే మరణించారు. షా అధికారంలోకి వచ్చారు. దీనికి కృతజ్ఞతగా ఇరాన్ చమురులో 40 శాతం వాటాను అమెరికా కంపెనీలకు అప్పగించారు. ఇరాన్‌లో సుమారు 25 ఏళ్ల పాటు అమెరికా అనుకూల నియంతృత్వ పాలన కొనసాగింది. ప్రస్తుతం ఇరాన్‌లో అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి రావడం, అమెరికా వారికి మద్దతుగా నిలవడం చూస్తుంటే.. మళ్ళీ 1953 నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CIA coup Iran 1953 Cold War Middle East Iran history debate Iran US relations history Mohammad Mossadegh overthrow Operation Ajax Iran Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.