📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran-Israel : ఇరాన్‌కు చాలా దేశాల మద్దతు ఉంది : రష్యా మాజీ అధ్యక్షుడు

Author Icon By Sudha
Updated: June 23, 2025 • 1:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌పై అమెరికా దాడిని పలు దేశాలు(Many countries) తీవ్రంగా ఖండిస్తున్నాయి(Condemning). ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) కీలక వ్యాఖ్యలు చేశారు.
కొన్ని దేశాలు ఇరాన్ కు ప్రామాణిక యుద్ధ శక్తులను– యుద్ధా‌పరంగా అణ్వాయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Iran-Israel : ఇరాన్‌కు చాలా దేశాల మద్దతు ఉంది : రష్యా మాజీ అధ్యక్షుడు

పలు దేశాలు ఖండన
అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌ (Iran-Israel conflict)కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్‌ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్‌ బస్టర్‌ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఇరాన్‌పై అమెరికా దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) కీలక వ్యాఖ్యలు చేశారు.
మరో కొత్త యుద్ధం
ఇరాన్‌పై దాడితో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యప్రాచ్యంలో కొత్త యుద్ధానికి తెరలేపారని ఆరోపించారు. శాంతి స్థాపకుడిగా వచ్చిన ట్రంప్‌.. అమెరికా కోసం కొత్త యుద్ధాన్ని ప్రారంభించారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ యుద్ధంలో అమెరికా ఎలాంటి గణనీయమైన సైనిక లక్ష్యాలను సాధించలేదని పేర్కొన్నారు. ‘ఇరాన్ అణుకేంద్రాలపై జరిపిన దాడులతో అమెరికా పెద్దగా సాధించిందేమీ లేదు. అణుకేంద్రాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ దాడుల ద్వారా మధ్యప్రాచ్యంలో మరో కొత్త యుద్ధానికి అమెరికా తెరలేపింది’ అని ఆయన మండిపడ్డారు. ఈ యుద్ధంలో ఇరాన్‌కు చాలా దేశాలు తమ సొంత అణ్వాయుధాలను (Nuclear Warheads) నేరుగా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.ఇరాన్ లో ప్రజలు తమ సుప్రీం లీడర్ ఖమనీ చుట్టూ ఏకమై-support చేస్తున్నారని, అది గట్టి ఆధిపత్యానికి దారితీస్తుందన్నారు .

ఇప్పుడు ఇరాన్‌కు మద్దతుగా చైనా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరినట్లు అయింది. ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనా (China) మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తునే ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం కారణంగా రెండు శక్తివంతమైన దేశాలు చెరో దేశానికి మద్దతుగా నిలవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం మరింత ముదిరి మూడో ప్రపంచ యుద్ధానికి (Third World War)దారి తీసే ప్రమాదం ఉందనే భయం వ్యక్తం అవుతోంది.ఈ ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచస్థాయిలో ఆర్థిక, మానవతా ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. పెట్రోల్ ధరలు, స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ రవాణా రంగాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, భారత్, రష్యా వంటి దేశాలు ఈ ఉద్రిక్తతలపై నిశితంగా గమనిస్తున్నాయి. ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరగకూడదన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

Read Also:Newyork: ఇరాన్‌పై దాడుల వేళ న్యూయార్క్‌లో ఆందోళనలు

#IranUSConflict #Medvedev #MiddleEastTensions #NuclearEscalation #RussiaWarns #USStrikeOnIran Breaking News in Telugu former Russian president Google news Google News in Telugu Iran has the Latest News in Telugu Paper Telugu News support of many countries: Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.