Iran Defense Minister: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

Read Time:  1 min
Iran Defense Minister: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?
FONT SIZE
GET APP

Iran Defense Minister: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ లక్ష్యంగా జరిపిన భీకర వైమానిక దాడుల్లో భారీ ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మేజర్ జనరల్ అమీర్ హతామీ మరణించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ మెరుపు దాడులు ఇరాన్ సైనిక నాయకత్వాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Air India: ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

Iran Defense Minister: Iranian Defense Minister killed in Israeli attacks?
Iran Defense Minister: Iranian Defense Minister killed in Israeli attacks?

టెహ్రాన్‌లో భీకర పేలుళ్లు.. దట్టమైన పొగలు

ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రక్షణ మంత్రి కార్యాలయం, ఇతర కీలక సైనిక భవనాల నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. ఈ దాడుల తీవ్రతకు నగరం అంతటా భయానక వాతావరణం నెలకొంది. తమ రక్షణ వ్యవస్థలు కొన్ని క్షిపణులను అడ్డుకున్నాయని ఇరాన్ సైన్యం చెబుతున్నప్పటికీ, భారీ నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక దృశ్యాలు తెలుస్తోంది.. ఈ సంఘటనతో పశ్చిమాసియా అంతటా వైమానిక ప్రదేశాలు మూసివేయబడ్డాయి. అయితే, ఈ వార్తలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.