📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran: అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

Author Icon By Saritha
Updated: March 9, 2026 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Iran: ఇరాన్‌పై జరిగిన దాడుల తర్వాత అమెరికా కీలక వ్యవస్థలపై సైబర్ ముప్పు తీవ్రమైంది. ఆ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే 60కి పైగా ఇరాన్ అనుకూల హ్యాకింగ్ గ్రూపులు ఆన్‌లైన్ వేదికగా అమెరికాపై దాడులకు సిద్ధమైనట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘క్లౌడ్‌సెక్’ సోమవారం విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది.

కృత్రిమ మేధ (ఏఐ) రాకతో ఈ సైబర్ దాడులు చేయడం హ్యాకర్లకు మరింత సులువుగా మారిందని క్లౌడ్‌సెక్ పరిశోధకులు తెలిపారు. సిస్టమ్స్‌పై ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తులు సైతం ఏఐ టూల్స్ సహాయంతో కేవలం ఐదు నిమిషాల్లోనే అమెరికాలోని టార్గెట్లను గుర్తించగలరని సంస్థ జరిపిన ఒక ప్రయోగంలో తేలింది.

Read Also: West Asia Conflict: పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

హ్యాకర్లకు వరంలా మారిన AI

ఈ హ్యాకర్లంతా టెలిగ్రామ్ వేదికగా ‘ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ రూమ్’ను ఏర్పాటు చేసుకుని, తమ టార్గెట్లను పంచుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల కంటే కూడా సైద్ధాంతిక కారణాలతోనే వీరు ఏకమవుతుండటంతో ఈ దాడులను అంచనా వేయడం, అడ్డుకోవడం కష్టంగా మారిందని నివేదిక పేర్కొంది. అమెరికాలోని పవర్ గ్రిడ్లు, వాటర్ సప్లై నెట్‌వర్క్‌లు, ఉత్పాదక సంస్థలను నియంత్రించే సుమారు 40 వేలకు పైగా ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్ (ఐసీఎస్) పబ్లిక్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నాయని, వీటికి కనీస పాస్‌వర్డ్ భద్రత కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. డిఫెన్స్, సెక్యూరిటీ కోసం వాడే ఏఐ టూల్స్‌నే హ్యాకర్లు ఇప్పుడు దాడులకు వాడుకుంటున్నారని నిపుణులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AI Cyber Attacks Iran Hackers Telegram US Cyber Security USA vs Iran Cyber War

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.