📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Iran attacks Kuwait: కువైట్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడులు

Author Icon By Saritha
Updated: March 20, 2026 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Iran attacks Kuwait: ఇరాన్ తన దాడులను ఉధృతం చేస్తూ గల్ఫ్ దేశాలలోని కీలక చమురు సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటోంది. కువైట్‌లో మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడికి పాల్పడింది. ఇటీవల ఖతార్‌లోని రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం, సౌదీ అరేబియాలోని అరామ్‌కో చమురుక్షేత్రంపై ఇరాన్ దాడులు చేసింది. పవిత్ర రంజాన్ పండుగ తరుణంలో ఈ దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

పశ్చిమాసియాలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకటిగా పేరుగాంచిన కువైట్‌లోని మినా అల్ అహ్మదీ పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడి కారణంగా రిఫైనరీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. రోజుకు సుమారు 7,30,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌పై దాడి జరగడం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అధికారులు మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: North Korea: డ్రోన్‌లను తిప్పికొట్టగల కొత్త ట్యాంక్‌ను నడిపిన కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె

Iran attacks Kuwait: Iranian drone attacks on Kuwait oil refinery

వరుస దాడులతో వణుకుతున్న గల్ఫ్ దేశాలు

ఇరాన్ కేవలం కువైట్ పైనే కాకుండా, గత కొన్ని రోజులుగా ఇతర గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేస్తోంది. ఇటీవల ఖతార్‌లోని రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం మరియు సౌదీ అరేబియాలోని ప్రతిష్టాత్మక అరామ్‌కో చమురు క్షేత్రాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ప్రాంతీయ పోరు మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతోంది.

మరోవైపు, దుబాయ్ నగరం పైకి ఇరాన్ భారీ స్థాయిలో డ్రోన్లు ప్రయోగించింది. దుబాయ్ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. ఈ క్రమంలో భారీ పేలుళ్లు వినిపించాయి. తమపై దూసుకొచ్చిన ఒక క్షిపణిని అడ్డుకున్నట్లు బహ్రెయిన్ తెలిపింది. క్షిపణి శకలాలు పడటంతో ఓ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Dubai drone attack Gulf tensions update Iran attacks Kuwait Middle East War Mina Al-Ahmadi refinery blast Oil prices impact Saudi Aramco attacks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.