పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. ఇరాన్ దళాలు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడితో విమానాశ్రయం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.
Read Also: Pushpak Tanker: భారత్‌కు వస్తున్న ‘పుష్పక్’ ట్యాంకర్‌తో ఇంధన సరఫరాకు ఊరట
రణరంగంగా మారిన విమానాశ్రయం
ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్ తాకడంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. క్షిపణి దాడుల ధాటికి ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో వేలాది మంది భయాందోళనకు గురయ్యారు. విమానాశ్రయ టెర్మినల్స్ నుంచి పొగ దట్టంగా కమ్ముకుంది. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు మరియు అధికారులు విమానాశ్రయాన్ని పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విమాన రాకపోకలను తక్షణమే నిలిపివేసి, ఎయిర్‌పోర్ట్‌ను యుద్ధ ప్రాతిపదికన మూసివేశారు. ఈ ఘటనలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: