Iran: ఇరాన్ ప్రకటనను పాక్ రక్షణ మంత్రి ఖండన

Read Time:  1 min
Iran: ఇరాన్ ప్రకటనను పాక్ రక్షణ మంత్రి ఖండన
FONT SIZE
GET APP

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ స్పందించింది. యుద్ధ పరిణామాల్లో ఇరాన్‌కు మద్దతుగా పాకిస్థాన్ నిలవడం గమనార్హం కాగా, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు హైలైటుగా నిలిచాయి.ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో పాకిస్థాన్ ప్రభుత్వం (Pakistan Government) ఇరాన్ కు మద్దతు ప్రకటించింది. అయితే, ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై అణు దాడి చేస్తామనే ప్రచారాన్ని పాక్ రక్షణ మంత్రి ఖండించారు. అదేసమయంలో అణ్వాయుధ లెక్కలను వెల్లడించని ఇజ్రాయెల్ పై పాక్ ఆందోళన వ్యక్తం చేసింది.

సీనియర్ అధికారి

ఇజ్రాయెల్ తమపై అణుబాంబు ప్రయోగిస్తే పాకిస్థాన్ వెంటనే ఇజ్రాయెల్‌పై అణుదాడికి దిగుతుందని ఇరాన్‌ (Iran) కు చెందిన ఒక సీనియర్ అధికారి నిన్న సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ తాజాగా స్పందించారు. అణు దాడికి (Nuclear Attack)సంబంధించి ఇరాన్ కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.అణు ప్రతీకారం గురించి ఎలాంటి చర్చ లేనప్పటికీ, ఇజ్రాయెల్‌తో ఘర్షణ విషయంలో పాకిస్థాన్ ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించింది.

 Iran: ఇరాన్ ప్రకటనను పాక్ రక్షణ మంత్రి ఖండన
Iran

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా

టెహ్రాన్‌పై దాడి జరిగిన అనంతరం, “ఇరాన్‌కు అండగా నిలుస్తామని” పాకిస్థాన్ పేర్కొంది. జూన్ 14న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మాట్లాడుతూ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఏకం కావాలని, లేదంటే ఇరాన్, పాలస్తీనాలకు పట్టిన గతే తమకూ పడుతుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలున్న ముస్లిం దేశాలు వాటిని తెంచుకోవాలని, ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) సమావేశమై ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also: Sriharikota: శ్రీహరికోటలో ఉగ్రవాదులు ఉన్నారంటూ బెదిరింపు

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.