అమెరికా(america)లో ఉన్నత విద్య పొందడం, మంచి ఉద్యోగం సంపాదించడం మరియు అక్కడే స్థిరపడడం అనేది భారతీయ విద్యార్థుల కల. అయితే, ఈ డ్రీమ్ సాకారం కావడం సులభం కాదు. తాజాగా అమెరికా ప్రభుత్వానికిది ఒక శుభవార్త. F-1 వీసా(visa) నిబంధనల్లో “ఇంటెంట్ టు లీవ్”(Intent to Leave) అనే కఠిన నియమాన్ని రద్దు చేసే దిశగా ‘డిగ్నిటీ యాక్ట్-2025’ ప్రతిపాదించబడింది. ఇది అమలైతే, విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
Read Also: Third World: ‘థర్డ్ వరల్డ్’ అర్థం ఏమిటి? – ఒక స్పష్టమైన వివరణ
ఇంటెంట్ టు లీవ్ అనేది ఇప్పటివరకు
ఇంటెంట్ టు లీవ్(Intent to Leave) అనేది ఇప్పటివరకు F-1 వీసాకు దరఖాస్తు చేసే విద్యార్థులు, “చదువు ముగిసిన వెంటనే మేము అమెరికాను విడిచి మా స్వదేశానికి తిరిగి వెళ్తాం” అని కాన్సులర్‌కు నిరూపించాల్సిన నిబంధన. దీన్ని నిరూపించడానికి ఆస్తులు, ఉద్యోగావకాశాల పత్రాలు చూపించాల్సి ఉండేది. ఈ కఠిన నిబంధన కారణంగా చాలా మంది విద్యార్థుల వీసాలు తిరస్కరించబడ్డాయి, ఫలితంగా విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గింది.
డిగ్నిటీ యాక్ట్-2025 అమలైతే, ఈ “తిరిగి వెళ్ళే ఉద్దేశం”ను నిరూపించాల్సిన అవసరం రాదు. విద్యార్థులు చదువులో ఉన్నంతకాలం అక్కడి లోకేషన్‌లో ఉండగలుగుతారు. అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం, చివరగా అధ్యక్షుడు సంతకం అవసరం. అదనంగా, హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ F-1 వీసాలకు పరిమిత కాల నివాస అనుమతి వంటి సౌకర్యాలను కూడా సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: