📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Intel : లేఆఫ్స్‌తో ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఇంటెల్‌

Author Icon By Sudha
Updated: July 17, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ (Intel) తన ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ఈ వారం యునైటెడ్ స్టేట్స్‌లో 5,000 మందికిపైగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గతంలో ప్రకటించిన 4,000 ఉద్యోగాల తగ్గింపు అంచనాకు మించి ఉంది . ప్రపంచవ్యాప్తంగా టెక్‌ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంటెల్‌ (Intel) 4 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ (Layoffs)ప్రకటించనున్నట్లు ఇటీవలే అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, 4 వేల మంది కాదని, 5 వేల మందిని తొలగిస్తున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ వారంలోనే అమెరికా వ్యాప్తంగా తొలగింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా లే ఆఫ్‌లు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఒరెగాన్‌, కాలిఫోర్నియాలో ఎక్కువగా తొలగింపులు ఉంటాయని పేర్కొంది.

Intel : లేఆఫ్స్‌తో ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఇంటెల్‌

పునర్వ్యవస్థీకరణ

ఇందులో కాలిఫోర్నియా ఆఫీస్‌ నుంచి 1,935 మంది, ఒరెగాన్ యూనిట్‌ నుంచి 2,392 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు తెలిసింది. అరిజోనా కార్యాలయం నుంచి 696 మందిపై వేటు పడనున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో ఇంటెల్‌ (Intel)కొత్త సీఈఓగా లిప్-బు టాన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్న ఇంటెల్, తన ఉద్యోగుల్లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే లేఆఫ్స్‌ను ప్రకటించింది.

ఇంటెల్ ఏ దేశానికి చెందినది?

ఇంటెల్ కార్పొరేషన్ అనేది కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక అమెరికన్ బహుళజాతి సంస్థ మరియు సాంకేతిక సంస్థ మరియు డెలావేర్‌లో విలీనం చేయబడింది.

ఇంటెల్ ఎందుకు తొలగింపులు చేస్తోంది?

ఇంటెల్ తన ఆర్థిక స్థితిని స్థిరీకరించడానికి చూస్తున్నందున వేలాది మంది కార్మికులను తొలగిస్తోంది. అయితే, ఈ కోతలు కొత్త CEO లిప్-బు టాన్ ఆధ్వర్యంలో చిప్ తయారీదారు వ్యూహం గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

ఇంటెల్ యజమానులు ఎవరు?

ఇంటెల్ (INTC) స్టాక్ యొక్క యాజమాన్య నిర్మాణం సంస్థాగత, రిటైల్ మరియు వ్యక్తిగత పెట్టుబడిదారుల మిశ్రమం. కంపెనీ స్టాక్‌లో దాదాపు 57.52% సంస్థాగత పెట్టుబడిదారుల యాజమాన్యంలో ఉంది, 0.08% ఇన్‌సైడర్‌ల యాజమాన్యంలో ఉంది మరియు 42.40% ప్రభుత్వ కంపెనీలు మరియు వ్యక్తిగత పెట్టుబడిదారుల యాజమాన్యంలో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై బ్రియాన్ లారా తీవ్ర ఆగ్రహం

Arizona Breaking News Intel Job Cuts latest news layoffs Oregon semiconductor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.