📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India-Pak: ఇండియా నుంచే పాకిస్తాన్‌ ఆర్మీకి సమాచారం.. వ్యక్తి అరెస్ట్‌!

Author Icon By Shobha Rani
Updated: May 17, 2025 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవలి భారత్-పాకిస్తాన్ (India-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల సమయంలో పాకిస్తాన్ సైన్యానికి, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి సమాచారం అందించాడనే ఆరోపణలపై హర్యానాలోని కైతాల్‌లోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని మస్త్‌గఢ్ చీకా గ్రామానికి చెందిన 25 ఏళ్ల దేవేంద్ర ధిల్లాన్‌గా గుర్తించారు. “కైతాల్ జిల్లా పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది, దాని ఆధారంగా మా ప్రత్యేక డిటెక్టివ్ సిబ్బంది మస్త్‌గఢ్ చీకా గ్రామ నివాసి నర్వాల్ సింగ్ కుమారుడు దేవేంద్రను అరెస్టు చేశారు” అని డీఎస్‌పీ వీర్భన్ అన్నారు.

India-Pak: ఇండియా నుంచే పాకిస్తాన్‌ ఆర్మీకి సమాచారం.. వ్యక్తి అరెస్ట్‌!

రాజద్రోహం, జాతీయ భద్రత చట్టం కింద నిందితుడిపై కేసులు
దేవేంద్రను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు అతడిని ప్రశ్నించారు. పోలీసుల కథనం ప్రకారం.. విచారణ సమయంలో తాను పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంప్రదింపులు జరిపినట్లు దేవేంద్ర పోలీసులకు వెల్లడించాడు. దేవేంద్ర పాటియాలాలోని ఖల్సా కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను కొంతకాలం క్రితం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పరచుకుని ఇండియాపై గూఢచర్యం ప్రారంభించాడని సమాచారం. అతని కుటుంబం మస్త్‌గఢ్ గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. అతని ఇంట్లో అతని తల్లిదండ్రులు, అమ్మమ్మ, సోదరి ఉంటారు.
ISIకి “ఆపరేషన్ సింధూర్” సమాచారాన్ని లీక్?
విచారణలో భారత్‌, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వివాదం గురించి ఆ ఏజెన్సీకి, ‘ఆపరేషన్ సిందూర్’ గురించి పాకిస్తాన్ సైన్యానికి, ISIకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేవాడినని అతను చెప్పాడు. సైబర్ పోలీసులు అతని వద్ద దొరికిన పరికరాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. దేవేంద్ర కొంతకాలంగా ఫేస్‌బుక్‌లో ఆయుధాలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నాడు. మొదట్లో తుపాకీలపై అతనికి ఉన్న ఆసక్తికి సంబంధించి అతన్ని అరెస్టు చేశారు. అయితే విచారణలో.. కీలక విషయాలు వెల్లడయ్యాయి. అతను భారత ఆర్మీ స్థావరాల ఫోటోలు, వీడియోలను పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు సమాచారం. దేవేంద్ర ఇటీవల కొంతమంది బంధువులతో కలిసి కర్తార్‌పూర్ సాహిబ్‌లో దర్శనం (తీర్థయాత్ర) కోసం పాకిస్తాన్‌ను సందర్శించాడు. ఈ పర్యటన సమయంలోనే అతనికి ISI కార్యకర్తలతో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. దేవేంద్రపై రాజద్రోహం, జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దేశానికి సంబంధించిన కీలక సమాచారం విదేశీ శత్రు దేశాలకు చేరుతుండటం జాతీయ భద్రతపై తీవ్రమైన ముప్పుగా మారుతోంది.
ఈ తరహా ఘటనలు మరోసారి అంతర్గత మౌలిక భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

Read Also: India missile: మరిన్ని ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైల్‌ కొనే యోచనలో భారత్‌?

Breaking News in Telugu Google news Google News in Telugu Information from Latest News in Telugu Man arrested! ndia to Pakistan Army.. Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.