📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Indonesia : ఇండొనేషియాలో బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం

Author Icon By Sudha
Updated: July 7, 2025 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండొనేషియాలోని (Indonesia) లెవోటోబి లకి లకి (Mount Lewotobi Laki Laki) అగ్నిపర్వతం మరోసారి బద్ధలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్‌ ద్వీపంలో ఈ లకిలకి అగ్నిపర్వతం ఉంది. ఇది ఇండొనేషియా(Indonesia) లోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది సోమవారం ఉదయం విస్ఫోటనం చెందింది.అగ్నిపర్వతం నుంచి బూడిద ఆకాశంలోకి 18 కిలోమీటర్ల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడుతోంది. దీంతో సమీపంలోని గ్రామాలను పెద్ద ఎత్తున బూడిద కప్పేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎలాంటి మరణాలూ సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు అగ్నిపర్వతం బద్దలవడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బాలి (Bali)కి వెళ్లాల్సిన పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Indonesia : ఇండొనేషియాలో బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం

ఇది రెండోసారి
1,584 మీటర్ల (5,197 అడుగులు) ఎత్తున్న లకిలకి అగ్నిపర్వతం చాలా క్రియాశీలకంగా ఉన్నది. ఇది విస్ఫోటనం చెందడం నెల వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెల 18వ తేదీన కూడా ఈ అగ్నిపర్వతం బద్దలైంది. అంతకుముందు ఈ ఏడాది మార్చి 21న విస్ఫోటనం చెందింది. గతేడాది నవంబర్‌లో కూడా బద్ధలైంది. కాగా, ఇండోనేషియా(Indonesia) లో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే. 2018లో అనక్‌ క్రకటౌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల సుమత్రా, జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది. అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలోపడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హల్మహెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం కారణంగా 60 మందికిపైగా మరణించారు. సమీపంలోని ఏడు గ్రామాలను ఖాళీ చేయించారు. మరోవైపు ఇండోనేషియా అంతటా వరుస అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాలను డేంజర్‌ జోన్‌లుగా ప్రకటించారు.

Read Also:hindi.vaartha.com

Read Also:Brics: ట్రంప్‌ షాక్‌: బ్రిక్స్‌ అనుకూల దేశాలపై అదనపు సుంకాలు

బాలిలో అతి పెద్ద అగ్నిపర్వతం ఏది?

ఇండోనేషియాలోని ఈశాన్య బాలిలోని అగ్నిపర్వతం, అగుంగ్ పర్వతం . బాలిలోని ఎత్తైన ప్రదేశం ఇది 9,888 అడుగుల (3,014 మీటర్లు) ఎత్తుకు పెరుగుతుంది.

లకి ఎక్కడ ఉంది?

దక్షిణ ఐస్లాండ్‌లోని లకి, అగ్నిపర్వతం, ద్వీపంలోని అతిపెద్ద మంచు క్షేత్రం అయిన వాట్నా హిమానీనదం (వాట్నాజోకుల్) కు నైరుతి దిశలో.

#IndonesiaNews #IndonesiaVolcano #LakiLakiEruption #NaturalDisaster #VolcanoEruption Breaking News in Telugu Indonesia news today Indonesia Volcano Eruption Laki Laki volcano latest eruption news Latest News in Telugu Telugu News Today volcanic eruption in Indonesia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.