📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Indo-America-మా స్నేహం చిరకాలమైనది..మార్కో రూబియో

Author Icon By Pooja
Updated: September 12, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Indo-America: మొన్నటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విమర్శలు చేస్తూ 50శాతం నుంచి వందశాతం టారిఫ్ లను విధించారు. అంతేకాదు భారత్ రష్యాతో అధిక చమురు కొనుగోలు చేస్తున్నదని, అందుకే రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధం ఆగిపోవడం లేదని, భారత్ ను నిందించారు. ఇటీవల మోడీ చైనా, రష్యా, జపాన్ దేశాలతో దౌత్యపరమైన సంబంధాలను పెంచుకోవడం ట్రంప్ కు ఏమాత్రం గిట్టడం లేదు. అందుకే భారత్ పై అవకాశం దొరికిన ప్రతిసారి ఏదో ఒక నిందను మోపుతున్నారు. అయితే వీటన్నింటికి భిన్నంగా అమెరికా విదేశాంత మంత్రి మార్కో రూపియో భారత్ పై ప్రశంసల జల్లును కురిపించారు. ఆయన ఏమన్నారంటే.. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికాలో అత్యున్నత సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కొనియాడారు. భారత్ లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్(Sergio Gore) ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే సెర్గియో గోర్ అభ్యర్థిత్వాన్ని సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెనెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి భారత్ కీలకపాత్ర పోషిస్తుందని మార్కో రూబియో పేర్కొన్నారు.

భారత్ తో సంబంధాలను మెరుగుపరచుకునే యత్నం

ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య నెలకొన్న సంఘర్షణలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం సహా ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఆయన ప్రస్తావించారు. భారత్ తో సంబంధాల విషయంలో మనం కొంత అసాధారణ స్థితిలో ఉన్నామని, దీనిపై వారితో కలిసి పనిని చేసి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే భారత్పై అమెరికా రాయబారిగా ప్రతిపాదించిన సెర్గియో గోర్ ను ప్రశంసించారు రూబియో(Rubio). ట్రంప్కు అత్యంత విధేయుడిగా గోర్ కు మంచి పేరుంది. సెర్గియో గోర్ కంటే ఈ పనులు చేయగల సమర్ధుడు తనకు మరొకరు కనిపించడం లేదని రూబియో అన్నారు.

చైనా నుంచి భారత్ ను దూరం చేయడమే తన లక్ష్యం: గోర్

భారత్ ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమని సెర్గియో గోర్ అన్నారు. తమ ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎన్ఎన్ఆ కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే ఉన్నాయని తెలిపారు. భారతదేశ మార్కెట్ అమెరికాకు అపారమైన అవకాశాలను అందిస్తుందని గోర్ పేర్కొన్నారు. అంతేకాక ఇరుదేశాల మధ్య నెలకొన్న అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. చైనీయులతో కంటే తమతోనే వారికి గొప్ప స్నేహం ఉందని అభిప్రాయపడ్డారు. భారత వాణిజ్య మంత్రి షీయాష్ గోయల్, ఇతర ప్రతినిధులను ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారని గోర్ ఈ సందర్భంగా తెలిపారు. అమెరికా ప్రజల ప్రయోజనాలు, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాలను తాము కుదుర్చుకుంటామని చెప్పారు. ఈ ఏడాది చివర్లో భారత్ ట్రంప్ వచ్చే అవకాశాలున్నాయని అన్నారు.

ఇండో-అమెరికా స్నేహంపై మార్కో రూబియో ఏమని అన్నారు?
మా స్నేహం చిరకాలమైనదని, రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతాయని అన్నారు.

ఇండో-అమెరికా స్నేహం ప్రాధాన్యం ఏమిటి?
వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య మరియు అంతర్జాతీయ భద్రతా రంగాల్లో పరస్పర ప్రయోజనాలు కలిగించడం.

Read hindi news: hindi.vaartha.com

Read also: Telugu News: Tirumala-పరిపాలన భవనంలో ఇఒ సింఘాల్ తనిఖీలు

Google News in Telugu India US Friendship Indo American Strategic Partnership Indo-America Relations Indo-US Ties Latest News in Telugu marco rubio Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.