📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Telugu news: Indigo: ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

Author Icon By Tejaswini Y
Updated: December 13, 2025 • 10:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IndiGo compensation: ఇటీవలి రోజుల్లో వరుసగా విమానాలు రద్దు కావడం, తీవ్ర ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావితమైన ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించింది. మొత్తం పరిహారం విలువ రూ.500 కోట్లకు మించవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని ఇండిగో సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా అధికారికంగా వెల్లడించింది.

Latest News: AP Cabinet: ఉద్యోగులకు డీఏ శుభవార్త.. ₹9,500 కోట్లతో 506 మున్సిపల్ ప్రాజెక్టులకు అనుమతి

ఫ్లైట్ క్యాన్సిలేషన్లపై ఇండిగో స్పందన

విమాన ప్రయాణానికి 24 గంటల ముందు సర్వీసులు రద్దైన ప్రయాణికులు, అలాగే కొన్ని విమానాశ్రయాల్లో ఎక్కువసేపు చిక్కుకుపోయిన వారికి ఈ పరిహారం వర్తిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది. నష్టపరిహారం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రయాణికులకు సులభంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సంస్థ పేర్కొంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ మొత్తం రూ.500 కోట్లకు పైగా ఉండే అవకాశముందని తెలిపింది.

పరిహారం చెల్లించే ప్రక్రియ

ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఎక్కువగా ప్రభావితమైన విమానాలు, ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నామని, జనవరి నెలలో వారిని నేరుగా సంప్రదించి పరిహారం చెల్లించే ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే పలువురు ప్రయాణికులకు రిఫండ్‌లు అందించామని, మిగిలిన రిఫండ్‌లు కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని ఇండిగో తెలిపింది.

ఇదిలా ఉండగా, గత నాలుగు రోజులుగా సంస్థ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని ఇండిగో వెల్లడించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 2,000కిపైగా విమానాలు నడపనున్నట్టు తెలిపింది. కార్యకలాపాల్లో అంతరాయానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు విమానయాన నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలోని ‘చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌సీ’ సంస్థను నియమించినట్టు పేర్కొంది. ఈ పరిణామాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా స్పందిస్తూ, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను పిలిపించి వివరణ కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

airline delay news flight delay India Indigo Airlines IndiGo compensation Indigo flight cancellations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.