విమానాల రద్దుతో ప్రయాణికులను(Indigo Airlines) తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ పై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ(Ministry of Aviation) కఠిన చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఐదో రోజు కూడా ఇండిగో సర్వీసులకు అంతరాయం కలగడంతో, కేంద్రం శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ప్రయాణికుల రిఫండ్‌లన్నింటినీ ఆదివారం డిసెంబర్ 7 రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, రద్దయిన విమానాల ప్రయాణికుల నుంచి టికెట్ల రీషెడ్యూలింగ్ కోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని ఎయిర్‌లైన్స్‌ను ఖరాఖండిగా ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
Read also: ప్రారంభమైన గుమ్మడి నర్సయ్య బయోపిక్
లగేజీ డెలివరీ, ప్రత్యేక సహాయక కేంద్రాలు
విమానాల రద్దు(Indigo Airlines) కారణంగా శనివారం దేశవ్యాప్తంగా 405 దేశీయ విమానాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు దూరమైన లగేజీని 48 గంటల్లోగా గుర్తించి, వారి నివాసానికి లేదా చిరునామాకు చేర్చాలని ఇండిగోను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి, రిఫండ్‌ల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. బాధితులైన ప్రయాణికులను స్వయంగా సంప్రదించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా రిఫండ్‌లు అందేలా చూడాలని తెలిపింది. పరిస్థితి చక్కబడే వరకు ఆటోమేటిక్ రిఫండ్ వ్యవస్థను కొనసాగించాలని, అలాగే వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు వంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రం స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: